భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ఎంపికైన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఈ అవార్డును తన అభిమానులందరికీ అంకితమిచ్చాడు. వారు లేకుండా ఈ ఘతన సాధ్యం కాదని స్పష్టం చేస్తూ వీడియోను ట్వీట్ చేశాడు. ఇతడితో పాటు పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనిక బత్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
-
Thank you for all your wishes and lots of love. pic.twitter.com/vbKaTbfwd7
— Rohit Sharma (@ImRo45) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you for all your wishes and lots of love. pic.twitter.com/vbKaTbfwd7
— Rohit Sharma (@ImRo45) August 22, 2020Thank you for all your wishes and lots of love. pic.twitter.com/vbKaTbfwd7
— Rohit Sharma (@ImRo45) August 22, 2020
ఇంతటి ఘనమైన గౌరవాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. దీనికి కారణం మీరే(అభిమానులు), మీ అందరికీ రుణపడి ఉన్నా. మీ మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. మీరు నాతో ఉంటే దేశం కోసం మరిన్ని పురస్కారాలను తీసుకొస్తా. ప్రస్తుతం భౌతిక దూరం పాటిస్తున్నందు వల్ల.. మీ అందరికీ ఆన్లైన్ వేదికగా హగ్ ఇస్తున్నా.
రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
గతంలో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న క్రికెటర్లలో సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత జట్టుకు కెప్టెన్ కానీ ఓ క్రికెటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.