వన్డేల్లో ద్విశతకం ఒక్కసారి కొట్టడమంటేనే వింతగా చూస్తారు. అలాంటిది ఇప్పటికే మూడు ద్విశతకాలు బాదేశాడు రోహిత్ శర్మ. ముఖ్యంగా శ్రీలంకపై చేసిన 264 పరుగుల ఇన్నింగ్స్‌ను అభిమానులు అస్సలు మర్చిపోరు. దీనితో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు హిట్‌మ్యాన్. ఈ ఘనతకు శుక్రవారంతో(నవంబరు 13) ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ ఇన్నింగ్స్ గురించి కథనం.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>
2014 నవంబరు 14న ఈడెన్‌గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల వరద పారింది. బంతి ఏదైనా స్టాండ్స్‌లోకే వెళ్లింది. రోహిత్.. 173 బంతుల్లో 264 పరుగులతో విజృంభించాడు. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే శ్రీలంక అతడిని ఔట్ చేసే అవకాశాన్ని వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.
రోహిత్.. తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీని(209) 2013లో ఆస్ట్రేలియాపై చేశాడు. 2017లో లంకేయులపై 207 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండోసారి, మూడోసారి శ్రీలంకపైనే ఈ ఘనత సాధించడం విశేషం.
ఇవీ చదవండి: