రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ముందు 314 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది భారత్. విజయం సాధించి రేసులోకి రావాలని కంగారూ జట్టు భావిస్తోంది.రాంచీలో ఆసిస్ చేసిన 314 పరుగులే అత్యధిక స్కోరు.
Innings Break!
— BCCI (@BCCI) March 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia post a total of 313/5 in 50 overs.
Scorecard - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/HZNjeAkXKe
">Innings Break!
— BCCI (@BCCI) March 8, 2019
Australia post a total of 313/5 in 50 overs.
Scorecard - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/HZNjeAkXKeInnings Break!
— BCCI (@BCCI) March 8, 2019
Australia post a total of 313/5 in 50 overs.
Scorecard - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/HZNjeAkXKe
ఆసిస్ ఓపెనింగ్ అదిరెన్..
టాస్ గెలిచిన టీమిండియా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు ఫించ్, ఖవాజా చెలరేగి ఆడి మొదటి వికెట్‌కు 193 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు.ఆసిస్కుభారత గడ్డపైమొదటి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఫామ్‌ను అందుకోలేక తంటాలుపడుతున్న కెప్టెన్ ఫించ్ 93 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ ఖవాజా 104 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
మాక్స్వెల్ ఉండుంటే..
అనంతరం మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా చేసిన అద్భుత రనౌట్‌కు పెవిలియన్ బాట పట్టాడు. భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆస్ట్రేలియా చివరి పది ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో షాన్ మార్ష్ 7, స్టాయినిస్ 31, క్యారీ 21 పరుగులే చేయగలిగారు. హాండ్స్‌కాంబ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
కుల్దీప్ మాయ..
ఆసిస్ ఓపెనర్లు చెలరేగగా 30 ఓవర్ల వరకు వికెట్లు తీయలేకపోయారు భారత్ బౌలర్లు. ఫించ్‌ను ఎల్బీడబ్ల్యుగా ఔట్ చేసిన కుల్దీప్.. ప్రత్యర్ధి తక్కువ పరుగులు చేయడానికి తొలి అడుగు వేశాడు. షాన్ మార్ష్, హాండ్స్కాంబ్ను ఒకే ఓవరులో పెవిలియన్‌కు పంపాడు.
Two crucial wickets for @imkuldeep18 in a single over. Shaun Marsh and Handscomb depart.
— BCCI (@BCCI) March 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/Kzj7O3grQl
">Two crucial wickets for @imkuldeep18 in a single over. Shaun Marsh and Handscomb depart.
— BCCI (@BCCI) March 8, 2019
Live - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/Kzj7O3grQlTwo crucial wickets for @imkuldeep18 in a single over. Shaun Marsh and Handscomb depart.
— BCCI (@BCCI) March 8, 2019
Live - https://t.co/DQCJoMdrym #INDvAUS pic.twitter.com/Kzj7O3grQl
మిగతా బౌలర్లలో షమికి మాత్రమే ఒక వికెట్ దక్కింది. 104 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్దు ఖవాజాను అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. వికెట్లేమీ తీయకున్నా మిగతా బౌలర్లు పరిధి మేర రాణించారు.
పుల్వామా దాడికి నివాళిగా భారత జట్టు సభ్యులందరూ ఆర్మీ క్యాప్లతో మైదానంలో కనిపించారు.