ETV Bharat / sports

రహానేకు కెప్టెన్సీ భారం కాదు: గావస్కర్ - భారత్Xఆస్ట్రేలియా

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ పితృత్వ సెలవుల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కానున్న నేపథ్యంలో అజింక్యా రహానేపై కెప్టెన్సీ ఒత్తిడి పెద్దగా ఉండకపోవచ్చని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్​తో జరిగే చివరి మూడు టెస్టులకు రహానే సారథ్యం వహించనున్న నేపథ్యంలో గావస్కర్​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

There will be no pressure of captaincy on Rahane says Gavaskar
కెప్టెన్సీ... రహానేకు భారం కాదు: గావస్కర్
author img

By

Published : Dec 14, 2020, 5:18 PM IST

టీమ్ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే​ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవ్వడని భారత మాజీ బ్యాట్స్​మన్ సునీల్​ గావస్కర్​ అభిప్రాయపడ్డాడు. విరాట్​ కోహ్లీ మొదటి టెస్టు అనంతరం పితృత్వ సెలవులపై స్వదేశానికి రానున్న నేపథ్యంలో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"కెప్టెన్సీ వహించడం అజింక్యా రహానేకు భారం కాకపోవచ్చు. ఎందుకంటే గతంలోనూ రహానే రెండు టెస్టులకు సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​కు కెప్టెన్​గా ఉన్నాడు. అలాగే అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ భారత్​కు సారథ్యం వహించాడు. ఈ రెండు మ్యాచ్​లూ భారత్​ గెలిచింది."

- సునీల్ గావస్కర్, భారత మాజీ ఆటగాడు.

సుదీర్ఘ ఫార్మాట్​కు ముందు జరిగిన రెండు వార్మప్​ మ్యాచ్​లకూ రహానే కెప్టెన్సీ చేశాడు. దీనిపై స్పందించిన గావస్కర్.. చివరి మూడు మ్యాచ్​లకు సారథ్యం వహిస్తూనే రహానే బ్యాట్స్​మన్​గా రాణించగలడని ధీమా వ్యక్తం చేశాడు. చెతేశ్వర్​ పుజారా బ్యాటింగ్​తో ప్రత్యర్థిని బయపెట్టగలడని అన్నాడు.

ఇదీ చదవండి:కోపం వచ్చింది.. సెంచరీ కొట్టేశా: పంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.