ETV Bharat / sports

ఆసియా కప్​-2020 నిర్వహణపై సందేహాలు

author img

By

Published : Apr 10, 2020, 11:40 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్ నిర్వహణ సందేహమేనని అన్నారు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహెసన్ మణి. రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

ఆసియా కప్​-2020 నిర్వహణ సందేహమే
భారత్ పాక్

కరోనా వల్ల ఇప్పటికే చాలా టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడీ జాబితాలోకి చేరేలా కనిపిస్తోంది ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్. ఈ విషయాన్నే పరోక్షంగా వెల్లడించారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహెసన్ మణి. టోర్నీ జరగడం సందేహమేనని అన్నారు.

Pakistan Cricket Board chief Ehsan Mani
పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహెసన్ మణి

"ఆసియా కప్-2020పై సందిగ్ధత నెలకొంది. రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా ప్రపంచాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తోసేసింది. సెప్టెంబరుకు ఇవి ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. అప్పటికి అంతా చక్కబడుతుందని భావిస్తున్నా" -ఎహెసన్ మణి, పీసీబీ ఛైర్మన్

షెడ్యూల్​ ప్రకారం ఈ సెప్టెంబరులో పాక్ వేదికగా ఆసియా కప్ జరగాలి. దాయది దేశానికి అయితే తమ జట్టును పంపించమని.. బీసీసీఐ చెప్పింది. ఈ కారణంతో తొలుత మాటల యుద్ధానికి దిగిన పీసీబీ.. ఆ తర్వాత తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించేందుకు అంగీకరించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీ జరగడం సందేహమేనని అన్నారు పీసీబీ ఛైర్మన్ మణి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.