టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రతిభ అతడికి ఉందని, భారత జట్టులో పాండ్య లాంటి క్రికెటర్ దరిదాపుల్లో లేడని చెప్పాడు. ఇటీవల కాలంలో ఆడిన మ్యాచ్‌లే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నాడు.
"హార్దిక్ ప్రతిభకు సరితూగే క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో లేడు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని భారత జట్టులోకి తీసుకుంటుంది బీసీసీఐ." -వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్
12వ ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించడంలో హార్దిక్ ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటు, బంతితో రాణించి ఆకట్టుకున్నాడు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 191.42 సగటుతో 402 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 91.
ఇంగ్లండ్‌లో త్వరలో ప్రారంభం కానుంది వన్డే ప్రపంచకప్. అందులో పాల్గొనే భారత జట్టులో పాండ్య ఒకడు. ఆ మెగాటోర్నీలో తనదైన ఆటతో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడీ క్రికెటర్.
ఇది చదవండి: 'మా విజయాలకు ఆ ముగ్గురి సలహాలే కీలకం' అంటున్న యజ్వేంద్ర చాహల్