ETV Bharat / sports

లంకపై విండీస్ విజయం- సిరీస్​ కైవసం​ - శ్రీలంక

సొంతగడ్డపై లంకతో జరిగిన టీ20 సిరీస్​ను వెస్టిండీస్​ గెలుపొందింది. మూడు మ్యాచ్​ల పొట్టి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​లో 3 వికెట్లతో విజయం సాధించింది కరీబియన్ జట్టు.

The West Indies won the T20 series against Sri Lanka on home soil
చివరి టీ20లో విండీస్ గెలుపు- సిరీస్​ కైవసం​
author img

By

Published : Mar 8, 2021, 8:59 AM IST

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​ను విండీస్​ జట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​లో కరీబియన్​ జట్టు అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. దినేష్​ చండిమల్ (54), అషెన్ బండారా (44) రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్​తో మాథ్యూస్ సేనను తక్కువ పరుగులకే పరిమితం చేసింది విండీస్​.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన పొలార్డ్​ సేన.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. సిమన్స్​ (26), పూరన్​ (23) మెరుగైన ప్రదర్శన చేశారు. లంక బౌలర్లలో లక్షణ్​ సందాకన్​ 3, డిసిల్వా 2 వికెట్లు తీసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసిన ఫాబియన్​ అలెన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులే ఇచ్చిన అలెన్ ఓ వికెట్​ తీసుకున్నాడు. బ్యాటింగ్​లోనూ 6 బంతుల్లో 21 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్​తో విండీస్​ను విజయతీరాలకు చేర్చిన అతడికి ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

ఇదీ చదవండి: 'బయో బుడగ వల్ల ఆటే కాదు బంధమూ బలపడింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.