ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి పెరుగుతోంది. సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఫ్రాంఛైజీలు.. ఆటగాళ్లతో శిబిరాలు ఏర్పాటు చేశాయి. రాబోయే సీజన్‌లో ఎలా రెచ్చిపోవాలని కోరుకుంటున్నాయో విచిత్రంగా చెబుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. జట్టులో విధ్వంసకర ఓపెనర్లు, ఫినిషర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ సాంతం ఆడుతూ వారికి అండగా నిలిచే ఆటగాళ్లు అవసరం. టీమ్‌ఇండియా యువ ఆటగాడు మనీశ్‌పాండే.. హైదరాబాద్‌కు ఇదే పాత్రను పోషిస్తున్నాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతూ వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు. అవసరమైతే భారీ సిక్సర్లు బాదేస్తూ రెచ్చిపోతాడు.
-
Now you know what to expect from @im_manishpandey 😎
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Some ruthless batting 🔥#AravindaSamethaManish #OrangeArmy #SRH pic.twitter.com/dj5MrmXo92
">Now you know what to expect from @im_manishpandey 😎
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2021
Some ruthless batting 🔥#AravindaSamethaManish #OrangeArmy #SRH pic.twitter.com/dj5MrmXo92Now you know what to expect from @im_manishpandey 😎
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2021
Some ruthless batting 🔥#AravindaSamethaManish #OrangeArmy #SRH pic.twitter.com/dj5MrmXo92
అందుకే ఐపీఎల్ 2021లో మనీశ్ ఎలా ఆడాలని కోరుకుంటుందో ట్వీట్ చేసింది. 'అరవింద సమేత వీర రాఘవ'కు చెందిన చిత్రాన్ని మనీశ్‌తో ఎడిట్ చేసింది. 'అరవింద సమేత మనీశ్ పాండే' అంటూ కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న చిత్రం అభిమానులతో పంచుకుంది. 'మనీశ్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనకు తెలిసిందే. నిర్దాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్' అని వ్యాఖ్య జోడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: వన్డేల్లో తొమ్మిదోసారి కోహ్లీని ఔట్ చేసిన రషీద్