ETV Bharat / sports

'ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం దేశాభివృద్ధికే'

ఐపీఎల్​​​ను ఆర్థిక సంపత్తిగా భావించే వారిపై మండిపడ్డాడు బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​. ఈ లీగ్​ ద్వారా వచ్చే ఆదాయం దేశాభివృద్ధికి దోహదపడుతుందని అన్నాడు.

arun
అరుణ్​ ధుమాల్​
author img

By

Published : Jul 5, 2020, 10:49 PM IST

ఐపీఎల్‌ నుంచి వచ్చే ఆదాయం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని, అది బీసీసీఐ అధికారులకు చేరదని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ను ఆర్థిక సంపత్తిగా భావించే వారిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా క్రిక్‌బజ్‌ కార్యక్రమంలో మాట్లాడిన ధుమాల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"ఆడేందుకు అన్ని పరిస్థితులు బాగుంటేనే ఐపీఎల్‌ జరుగుతుంది. దీన్నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆటకు దూరంగా క్రికెటర్లు ఎంతకాలం ఉండాలి? ఎప్పుడో ఒకసారి క్రికెట్‌ తిరిగి కొనసాగాలి. ఐపీఎల్‌ అంటే మనీ మేకింగ్‌ మెషీన్‌ అని అంతా అంటున్నారు. అలాగైతే అదే అనుకోండి. ఆ డబ్బంతా ఎవరు తీసుకుంటారు?" అని మండిపడ్డాడు.

"అదంతా ఆటగాళ్లకు వెళ్తుంది. బీసీసీఐ అధికారులకు కాదు. దాని ద్వారా వచ్చే ఆదాయం దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. దీని వల్ల పర్యాటక, రవాణ రంగాలు బాగుపడతాయి. ఆయా రంగాలు పన్నులు చెల్లిస్తాయి. అలాంటప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ డబ్బంతా ఆటగాళ్లకు, టోర్నీ నిర్వాహకులకు వెళ్తుంది. ఈ విషయంలో మీడియా తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఐపీఎల్‌ వల్ల కలిగే లాభాలను ప్రజలకు చేరవేయాలి. దీన్నుంచి బీసీసీఐ కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో కడుతుంది. అది దేశాభివృద్ధికి సహాయపడుతుంది. ఆ డబ్బు గంగూలీకో, జైషాకో, నాకో వెళ్లదు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్రీడలపై ఖర్చు చేస్తే అది మరింత డబ్బును సృష్టిస్తుంది. అందుకు సంతోషించాలి" అని ధుమాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరోవైపు దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌ 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. ఒకవేళ ఐసీసీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇది చూడండి : భారత 66వ చెస్ గ్రాండ్​ మాస్టర్​గా ఆకాశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.