టీమిండియా జట్టులోకి మరో అన్నదమ్ముల జోడీ వచ్చి చేరింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో సోదరులైన రాహుల్ చాహర్, దీపక్ చాహర్‌లు టీ20ల్లో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో వీరిద్దరూ మంచి ప్రదర్శన చేశారు.
ఐపీఎల్లో ముంబయి తరఫున బరిలోకి దిగిన రాహుల్ చాహర్ 13 వికెట్లతో సత్తాచాటాడు. పరుగులను కట్టడి చేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచగల సమర్థుడు. రాహుల్ అన్నయ్య దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొదటి పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
తాజాగా వీరిద్దరూ టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున ఇది నాలుగో అన్నదమ్ముల జోడీ. ఇంతకుముందు మొహిందర్ అమర్నాథ్-సురీందర్ అమర్నాథ్, ఇర్ఫాన్ పఠాన్-యూసుఫ్ పఠాన్, హార్దిక్ పాండ్య-కృనాల్ పాండ్య సోదరులు టీమిండియా తరఫున ఆడారు.
ఇవీ చూడండి.. 'టీ-20 ప్రదర్శనతో రాయుడిని వన్డేలకు తీసుకోలేం'