టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భాగంగా శనివారం జరిగిన మూడో రోజు ఆటలో.. ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ జారవిడిచాడు. షమీ బౌలింగ్‌లో బ్యాట్ అంచుకు తగిలి ఆ క్యాచ్ రాగా.. దాన్ని అందుకోవడంలో హిట్‌మ్యాన్ విఫలమయ్యాడు. మైదానంలోనే తన ఆటపై కాస్త అసహనం వ్యక్తం చేసిన రోహిత్.. బంతిని ఎందుకు వదిలేశాననే విషయంపై మరింత దృష్టి పెట్టాడు. లంచ్ విరామంలో అదే తరహా స్లిప్ క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. ఏ బంతికి ఎలా స్పందించాలో అంచనా వేసుకున్నాడు.
లంచ్ తర్వాత షమీ వేసిన 26వ ఓవర్‌లో మహ్మదుల్లా ఇచ్చిన స్లిప్ క్యాచ్‌ను.. ఈ సారి రోహిత్ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్లో పోస్టు చేసింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రహీమ్.. 105 బంతుల్లో 64 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా భారత్ తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగులతో తేడాతో విజయం సాధించింది.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>