టీమిండియా స్వింగ్ రారాజుగా పేరు తెచ్చుకున్న బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించాడీ పేసర్. గతంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరతో చోటుచేసుకున్న స్లెడ్జింగ్ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ నోరు విప్పాడు. ఆ సందర్భంలో సంగక్కర భార్యను ఉద్దేశించి తాను ఏదో అన్నానన్నాడు. అందువల్లే ఇద్దరి మధ్యా అగ్గి రాజుకుందని తెలిపాడు.
"కుమార సంగక్కరతో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. దిల్లీలో ఆడుతున్న ఆ టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌కు ముందు సెహ్వాగ్‌కు గాయమవడం వల్ల నన్ను ఓపెనింగ్‌కు పంపారు. అప్పుడు మురళీ ధరన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ నేను 93 పరుగుల వద్ద కొనసాగుతున్నా. అప్పుడే సంగక్కరకు మ్యాచ్ తమ చేతుల నుంచి జారిపోతుందని అర్థమై ఏదో మాట తూలాడు. ఏదో వ్యక్తిగతంగా దూషించాడు. నేను కూడా అలాగే అన్నాను. అప్పుడతని భార్య గురించి మాట్లాడాను. సంగక్కర మా తల్లి దండ్రుల గురించి అన్నాడు. దీంతో మా ఇద్దరి మధ్య అగ్గిరాజుకుంది".
--ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్
క్షమించమని అడిగా..!
ఆ స్లెడ్జింగ్ వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత పఠాన్, సంగక్కర కలిసి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడారు. ఈ టోర్నీ సమయంలో భారత్‌కు వచ్చిన తన భార్య ఎహాలీను పరిచయం చేశాడట సంగక్కర. అప్పుడు క్షమాపణ కోరినట్లు పఠాన్ వెల్లిడించాడు. అయితే లంక మాజీ క్రికెటర్ కూడా తన కుటుంబం కోసం నోరిజారినట్లు భార్య ముందే ఒప్పుకున్నాడని ఇర్ఫాన్ చెప్పాడు. అప్పట్నుంచి సంగ్కర-తాను మంచి స్నేహితులైనట్లు తెలిపాడు పఠాన్.
2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ పఠాన్.. దాదాపు 9 ఏళ్లు క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో 29 టెస్టులు, 120 వన్డేలతో పాటు 24 టీ20లు ఆడాడు. గాయల బెడద లేకపోతే ఇంకా ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితే ఉండేందని చెప్పాడు పఠాన్. 2012 అక్టోబరులో చివరిగా దక్షిణాఫ్రికాతో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్.. ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా పనిచేస్తున్నాడు.
-
Thank you all for making this journey most memorable.Wanted to Thank all the coaches & team mates.After my family,my fans have been my biggest strength! Thank u for not leaving me in my tough times.. #IrfanPathanRetires pic.twitter.com/axV3QvdO3p
— Irfan Pathan (@IrfanPathan) January 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you all for making this journey most memorable.Wanted to Thank all the coaches & team mates.After my family,my fans have been my biggest strength! Thank u for not leaving me in my tough times.. #IrfanPathanRetires pic.twitter.com/axV3QvdO3p
— Irfan Pathan (@IrfanPathan) January 4, 2020Thank you all for making this journey most memorable.Wanted to Thank all the coaches & team mates.After my family,my fans have been my biggest strength! Thank u for not leaving me in my tough times.. #IrfanPathanRetires pic.twitter.com/axV3QvdO3p
— Irfan Pathan (@IrfanPathan) January 4, 2020