ETV Bharat / sports

''కంకషన్​ సబ్​స్టిట్యూట్​'ను దుర్వినియోగం చేయొద్దు' - కంకషన్​ సబ్​స్టిట్యూట్​పై సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు

తొలి టీ20లో జడేజాకు కంకషన్ సబ్​స్టిట్యూట్​గా చాహల్​ రావడంపై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఈ పద్ధతిని దుర్వినియోగం చేయొద్దని వ్యాఖ్యానించాడు.

Mark Taylor
'కంకషన్​ సబ్​స్టిట్యూట్​'ను దుర్వినియోగం చేయొద్దు: టేలర్
author img

By

Published : Dec 5, 2020, 8:45 PM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్ టేలర్ కంకషన్ సబ్​స్టిట్యూట్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పద్ధతిని... నిజాయతీగా, బాధ్యతగా ఆటగాడిని రక్షించేందుకు మాత్రమే ఉపయోగించాలని వ్యాఖ్యానించాడు.

కాన్​బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో రవీంద్ర జడేజాకు బదులుగా చాహల్​ను కంకషన్​ సబ్​స్టిట్యూట్​ చేశారు. దీనిని పలువురు సమర్థించగా మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టేలర్ పై వ్యాఖ్యలు చేశాడు.

" కంకషన్​ సబ్​స్టిట్యూట్​ పద్ధతిని ఆటగాడిని రక్షించేందుకు మాత్రమే ఉపయోగించాలి. ఆటను కొనసాగించేలా చేసే ఆటగాళ్లన్నా, కోచ్​లన్నా నాకు చాలా ఇష్టం. ఆటకు అంతరాయం ఏర్పడకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి నిజాయతీగా పాటించాలి. మరి భారత్​ ఈ పద్ధతిని ఎలా ఉపయోగించిందనే దానిపై స్పష్టత అవసరం."

-టేలర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.

గావస్కర్​కు నచ్చలేదట..

ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్.. జడేజాకు బదులుగా చాహల్​ ఆడటంలో తప్పులేదని పేర్కొన్నాడు. కానీ, తనకు ఈ కంకషన్​ సబ్​స్టిట్యూషన్​ పద్ధతి నచ్చదని వెల్లడించాడు.

ఇదీ చదవండి:వర్ణవివక్షతో పుజారాను అలా పిలిచేవారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.