ETV Bharat / sports

ధోనీని తలపించిన భాటియా.. ఆసీస్​పై సూపర్​ కీపింగ్​

author img

By

Published : Feb 21, 2020, 6:44 PM IST

Updated : Mar 2, 2020, 2:32 AM IST

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మహిళా టీ20 ప్రపంచకప్​లో భారత్ శుభారంభం చేసింది. ప్రారంభ మ్యాచ్​లో బ్యాట్​తో దీప్తి, బౌలింగ్​లో పూనమ్​ రాణించగా.. కీపింగ్​లో తానియా భాటియా అదుర్స్​ అనిపించింది. ధోనీని తలపించేలా చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది.

Taniya Bhatia
ధోనీని తలపించిన భాటియా.. ఆసీస్​పై సూపర్​ కీపింగ్​

టీ20ల్లో ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్​ లైనప్​ ఉన్న జట్టుపై 133 పరుగుల లక్ష్యం​ కాపాడుకోవడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆఖరివరకు బ్యాటింగ్​ చేయగలిగే సత్తా ఆ జట్టు సొంతం. అలాంటి ఆసీస్​ను టీ20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లోనే ఓడించారు భారత మహిళలు. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో బౌలర్​ పూనమ్.. విజయంలో​ కీలకపాత్ర పోషిస్తే, వికెట్ కీపర్ తానియా​ భాటియా తనదైన కీపింగ్​తో మెప్పించింది.

'ధోనీ'లా కీపింగ్​!

లక్ష్యం తక్కువగా ఉన్నప్పుడు ఫీల్డింగ్​, కీపింగ్​లో తప్పులు జరిగితే ఫలితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్​లో మాత్రం భారత్.. అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా తానియా భాటియా కీపింగ్​లో చాలా చురుగ్గా స్పందించింది. ఫలితంగా రెండు క్యాచ్​లు, రెండు స్టంపౌట్​లు చేసింది.

ఆసీస్​ కెప్టెన్, విధ్వంసకర బ్యాట్స్​ఉమన్​​ మెక్​ లానింగ్​, మరో బ్యాటర్​ జొనాస్సెన్​నూ రెప్పపాటు క్యాచ్​లతో పెవిలియన్​ చేర్చింది భాటియా. హైనెస్​, అన్నాబెల్​ను అద్భుతమైన స్టంపింగ్​లతో ఔట్​ చేసింది. ఈమె తాజా ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా టీమిండియాకు మరో ధోనీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మహిళల టీ20ల్లో ఎక్కువ స్టంప్​లు చేసిన కీపర్ల జాబితాలో మూడో ర్యాంక్​లో నిలిచింది తానియా. ఈ జాబితాలో సారా టేలర్​(51), అలీసా హేలీ(45), తానియా భాటియా(42) వరుస స్థానాల్లో ఉన్నారు.

వరుసగా మూడుసార్లు

ఐసీసీ నిర్వహించిన గత మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియాపై భారత్ మహిళా జట్టు​ గెలవడం విశేషం. 2017 వన్డే ప్రపంచ​కప్​లో 38 పరుగుల తేడాతో, 2018 టీ20 ప్రపంచకప్​లో 48 పరుగులు తేడా​తో, ప్రస్తుత టీ20 ప్రపంచకప్​లో 17 పరుగులతో విజయం సాధించింది ఉమెన్ టీమిండియా.

  • India v Australia in their last three meetings in ICC tournaments 👀

    2017 CWC ➡️ 🇮🇳 won by 36 runs
    2018 T20WC ➡️ 🇮🇳 won by 48 runs
    2020 T20WC ➡️ 🇮🇳 won by 17 runs

    Bogey team? pic.twitter.com/iJ0z8F88QQ

    — T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి...

టీ20 ప్రపంచకప్: బౌలర్ పూనమ్​ మూడో హ్యాట్రిక్​ మిస్​

ప్రపంచకప్​: ఆరంభం అదుర్స్​.. ఆసీస్​పై భారత్ విజయం

Last Updated : Mar 2, 2020, 2:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.