తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) ఆటగాడు ప్రశాంత్ రాజేశ్ కన్నుమూశారు. 35 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ 2018 నుంచి ఆ లీగ్‌లో ఆడుతున్నారు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల మృతిచెందారు. ఈ విషయాన్ని టీఎన్‌పీఎల్ తమ అధికారిక ట్విటర్‌లో వెల్లడించి సంతాపం తెలిపింది. రాజేష్ తమిళనాడు తరఫున అండర్- 16, అండర్ 19 జట్లకు ప్రాతినిధ్యం వహించగా.. అక్కడ మంచి ప్రదర్శన చేసి తమిళనాడు ప్రీమియర్ లీగ్‌కు ఎంపికయ్యారు. ఇక్కడ లైకా కోవై కింగ్స్ తరఫున ఆడిమంచి గుర్తింపు పొందారు.
-
RIP M.P Rajesh.. So hard to believe that you are no more. I will never forget the after match conversations we used to have @sanch_cs @raaravind
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">RIP M.P Rajesh.. So hard to believe that you are no more. I will never forget the after match conversations we used to have @sanch_cs @raaravind
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 5, 2020RIP M.P Rajesh.. So hard to believe that you are no more. I will never forget the after match conversations we used to have @sanch_cs @raaravind
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 5, 2020
ఈ వార్త తెలుసుకున్న టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా ఈవెంట్‌లో దిల్లీ తరఫున ఆడుతున్న అశ్విన్.. ట్విటర్ ద్వారా స్పందించాడు. అతడు లేడనే విషయాన్ని నమ్మడం చాలా కష్టంగా ఉందని అన్నాడు. మ్యాచ్‌లు పూర్తయ్యాక తామిద్దరం కూర్చొని చర్చించుకునేవారిమని గుర్తుచేసుకున్నాడు. ఆ విషయాలు తానెప్పటికీ మర్చిపోనని అశ్విన్ పేర్కొన్నాడు.