భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ గురువారం మృతిచెందారు. చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే ఆయన బలవన్మరణానికి కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చంద్రశేఖర్ గుండెపోటుతో మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యేనని ధ్రువీకరించారు.
1988 నుంచి 1990 వరకు భారత్ తరఫున ఏడు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 88 పరుగులు చేశారు చంద్రశేఖర్. తమిళనాడుకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ దేశవాళీలో 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు. 4వేల 999 పరుగులు చేశారు. ఈయన అత్యుత్తమ స్కోరు 237 నాటౌట్.
గ్రెగ్‌చాపెల్ టీమిండియా కోచ్‌గా ఉన్న సమయంలో చంద్రశేఖర్ జాతీయ జట్టుకు సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
చంద్రశేఖర్ 25 ఏళ్ల వయసులో తమిళనాడు రంజీ జట్టు తరఫున తొలిసారి క్రికెట్ ఆడారు. ఈ ఫార్మాట్‌లో 56 బంతుల్లోనే శతకం బాది, అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ ప్రదర్శనతోనే ఆయన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
ఇది చదవండి: రన్ మెషీన్... రికార్డులు చెదిరెన్..!