ఐపీఎల్లో అద్భుత ఫీల్డింగ్ విన్యాసాల్ని చూశాం. బౌండరీల వద్ద గాల్లో ఎగిరి క్యాచ్‌లు పట్టడాన్ని ఆస్వాదించాం. అయితే ఈ సన్నివేశాలు మహిళల టీ20 లీగ్‌లో అంతగా కనిపించవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఓ క్యాచ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. బ్రిస్బేన్ హీట్-అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం అవిష్కృతమైంది.
ఏం జరిగింది?
అడిలైడ్ స్ట్రైకర్స్ స్పిన్నర్ అమండా వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టాలని చూసింది అమీలియా కేర్. కానీ బ్యాట్‌కు బంతి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఆ బంతిని అందుకునేందుకు షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న మ్యాడీ పెన్నా గాల్లోకి డైవ్ చేసింది. కానీ చేతుల్లోకి జారిపోయింది. దీంతో ఆమె వెనకనే బంతి కోసం చూస్తున్న టహిలా మెక్‌గ్రాత్ దానిని అందుకునేందుకు అమాంతం డైవ్ చేసింది. బంతి నేలపై పడుతుందనుకున్న క్రమంలో ఒడిసిపట్టుకుంది. దీంతో కేర్ పెవిలియర్ చేరింది. ఈ వీడియోను మహిళల బిగ్‌బాష్ లీగ్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
-
You've gotta be kidding! Tahlia McGrath (with a bit of help from Maddy Penna) pulls off one of the great catches we've seen in the WBBL 😱 #WBBL06 pic.twitter.com/8TgEPXWTbI
— Rebel Women's Big Bash League (@WBBL) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You've gotta be kidding! Tahlia McGrath (with a bit of help from Maddy Penna) pulls off one of the great catches we've seen in the WBBL 😱 #WBBL06 pic.twitter.com/8TgEPXWTbI
— Rebel Women's Big Bash League (@WBBL) November 7, 2020You've gotta be kidding! Tahlia McGrath (with a bit of help from Maddy Penna) pulls off one of the great catches we've seen in the WBBL 😱 #WBBL06 pic.twitter.com/8TgEPXWTbI
— Rebel Women's Big Bash League (@WBBL) November 7, 2020
ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్స్పై అడిలైడ్ స్ట్రైకర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్ట్రైకర్స్ బౌలర్ వెల్లింగ్టన్ మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడొగట్టింది.