మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరే అవకాశాలను న్యూజిలాండ్ మరింత మెరుగుపరుచుకుంది. ఆ జట్టు ఇచ్చిన 92 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. బంగ్లా 74 రన్స్‌కే ఆలౌటైంది. కివీస్ బౌలర్లు కాస్పరెక్(3/23), జెన్సన్(3/11)ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. ఫలితంగా న్యూజిలాండ్ వుమన్ 17 రన్స్ తేడాతో గెలిచింది.
-
The comeback is complete 💪
— T20 World Cup (@T20WorldCup) February 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
New Zealand bowl out Bangladesh for 74 to win by 17 runs 👏#T20WorldCup | #NZvBAN
📝📽️ https://t.co/7XKkAyyIPh pic.twitter.com/qqj0YTVhjA
">The comeback is complete 💪
— T20 World Cup (@T20WorldCup) February 29, 2020
New Zealand bowl out Bangladesh for 74 to win by 17 runs 👏#T20WorldCup | #NZvBAN
📝📽️ https://t.co/7XKkAyyIPh pic.twitter.com/qqj0YTVhjAThe comeback is complete 💪
— T20 World Cup (@T20WorldCup) February 29, 2020
New Zealand bowl out Bangladesh for 74 to win by 17 runs 👏#T20WorldCup | #NZvBAN
📝📽️ https://t.co/7XKkAyyIPh pic.twitter.com/qqj0YTVhjA
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. బంగ్లా బౌలర్లు రీతూ మౌని(4/18), సల్మా(3/7), రుమానా(2/17) ప్రదర్శనకు 91 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ బ్యాటింగ్‌లో రఛేల్ ప్రీస్ట్(25) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఛేదనలో బంగ్లా జట్టులో కీపర్ నిగర్ సుల్తానా(21) మాత్రమే పోరాడింది.
తేలేది మార్చి 2న..
ప్రస్తుతం గ్రూప్-ఎలో భారత్ 6 పాయింట్లతో సెమీస్ చేరగా.. ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. ఈ జట్లు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి. మార్చి 2న ఈ రెండింటి మధ్య కీలక పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోనుంది.