కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్‌ల నిర్వహణను భారత్, ఆస్ట్రేలియాలు మార్చుకునే అవకాశాలు పరిశీలించాలని సూచించాడు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. భారత్‌లో ఈ వైరస్ ప్రభావం తగ్గితే టోర్నీని ఈ ఏడాది భారత్‌లో నిర్వహించి.. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాలో జరపాలని సూచించాడు.
"ఆసీస్ ప్రభుత్వం విదేశీయుల రాకను సెప్టెంబర్ 30 వరకు నిషేధించింది. కానీ, ప్రపంచకప్ అక్టోబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత్‌లో త్వరగా సాధారణ పరిస్థితి వస్తే ఇరుదేశాలు ఆతిథ్య బాధ్యతలను మార్చుకోవాలి. ఈ ఏడాది భారత్, వచ్చే ఏడాది ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాలి. అయితే ప్రపంచకప్ ముందు ఐపీఎల్ నిర్వహించాలి. దీని వల్ల ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. నవంబర్‌లో ప్రపంచకప్, డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా ఆసియాకప్ ఏర్పాటు చేయాలి"
- సునీల్ గావస్కర్, భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఐసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మను సావ్నే తెలిపారు. ఈ నెల 23న జరిగే కార్యనిర్వాహక సమావేశంలో స్పష్టత వస్తుందని వెల్లడించారు.
ఇదీ చూడండి.. లాక్డౌన్లో సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చిన కపిల్