ETV Bharat / sports

'ముస్తాక్ అలీ'లో మ్యాచ్​ల ఆతిథ్య ఫీజు పెంపు - Syed Mushtaq Ali Trophy

దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త. సయ్యద్ ముస్తాక్ అలీ పాల్గొనే జట్లకు చెల్లించాల్సిన ఫీజును, మ్యాచ్​ నిర్వహణ రుసుమును దాదాపు రూ.లక్ష మేర పెంచింది బీసీసీఐ.

syed
సయ్యద్​
author img

By

Published : Jan 11, 2021, 5:31 AM IST

ఆదివారం నుంచి ప్రారంభమైన దేశవాళీ టోర్నీ 'సయ్యద్​ ముస్తాక్​ అలీ' మ్యాచ్​ నిర్వహణ రుసుమును పెంచింది బీసీసీఐ. రూ.2,50,000 నుంచి రూ.3,50,000 వరకు పెంచినట్లు బోర్డు తెలిపింది. టోర్నీలో ఆడే జట్లకు చెల్లించాల్సిన ఫీజును రూ.50వేలు నుంచి రూ.75వేలకు పెంచినట్లు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో రాష్ట్ర క్రికెట్​ సంఘాలకు​, పాల్గొనే జట్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. రుసుములు పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షనీయమైనదని బంగాల్​ క్రికెట్​ అసోసియేషన్​ చెప్పింది.

జనవరి 10(ఆదివారం) నుంచి ఫ్రారంభమైన సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ.. ఈ నెల 31 వరకు జరగనుంది. ఈ టీ20 టోర్నీలో సత్తా చాటేందుకు యువ క్రికెటర్లు సహా సీనియర్లు బాగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి : నేటి నుంచే ముస్తాక్‌ అలీ టీ20

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.