ETV Bharat / sports

'అశ్విన్​ను ఎదుర్కోవడమంటే యుద్ధం చేసినట్లే' - pujara huge wicket joe root

టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ను ఎదుర్కోవడం అంటే యుద్ధం చేయడమేనని అన్నాడు ఇంగ్లాండ్​ సారథి జో రూట్​. పూజారాను దెబ్బతీయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పాడు. భారత్​తో జరిగే సిరీస్​లో తమ జట్టును గెలిపించడానికి తాన శాయశక్తులా ప్రయత్నిస్తానని వెల్లడించాడు.

aswin
అశ్విన్​
author img

By

Published : Feb 4, 2021, 4:37 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ను ఎదుర్కోవడం అంటే చిన్నపాటి యుద్ధం చేసినట్లేనని అన్నాడు ఇంగ్లాండ్​ సారథి జో రూట్​. అతడితో పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పాడు. ఫిబ్రవరి 5నుంచి భారత్​-ఇంగ్లాండ్​ మధ్య ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

"నేనెప్పుడు అతడిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించను. అతడు వేసిన బంతిని నాకు చేతనైనంతవరకు బాది.. ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. అతడికి భారత్​లో మంచి రికార్డు ఉంది. దాంతో అతడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అంతకముందు మేమిద్దరం తలపడ్డాం. కొన్ని సందర్భాల్లో అతడు, మరి కొన్ని సందర్భాల్లో నేను ఉత్తమంగా ఆడాము. ఏదేమైనప్పటికీ టెస్టుల్లో అతడిని ఢీ కొనడం అంటే చిన్నపాటి యుద్ధం చేసినట్లే. మొత్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే పోరులో ఉత్తమంగా రాణించడమే మా లక్ష్యం." అని రూట్​ అన్నాడు.

టీమ్​ఇండియా క్రికెటర్​ పుజారా గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు రూట్​. భారత జట్టులో అతడి వికెట్​ పడగొట్టడం కీలకమని అన్నాడు."పుజారా గొప్ప ఆటగాడు. అతడితో కలిసి ఆడినప్పుడు చాలా మెలకువలు నేర్చుకున్నాను. అతడి బ్యాటింగ్​ నైపుణ్యం అద్భుతం. ఆటతీరును ఎంతో ప్రేమిస్తాను. క్రీజులో ఎక్కువ సేపు నిలవగలడు. మానసిక బలం ఎక్కువ. అతడిని ఔట్​ చేస్తే మా పని కాస్త సులవైనట్లే. తనతో తలపడటం మాకు పెద్ద సవాల్​." అని రూట్​ వెల్లడించాడు.

ఇటీవల శ్రీలంకపై ఇంగ్లాండ్​ విజయం సాధించడంలో​ సారథి జోరూట్​(426) ఇన్నింగ్స్​సే ప్రధాన కారణం. స్పిన్​ ప్రభావం చూపించే శ్రీలంకలో అతడు ఇన్ని పరుగులు చేశాడంటే కారణం స్వీప్​ షాట్​. సాధారణంగా టర్న్‌ అయ్యే బంతుల్ని ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ వాడే ప్రధాన అస్త్రం స్వీప్‌. అయితే అందరూ దీన్నంత సమర్థంగా ఆడలేరు. లంక సిరీస్​లో రూట్‌ 37 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదాడు. అందులో 16 బౌండరీలు స్వీప్‌ షాట్‌ ద్వారానే లభించాయి. మొత్తంగా 105 పరుగులు స్వీప్‌ ద్వారా రాబట్టాడు. అయితే టీమ్ఇండియాతో ఇంగ్లాండ్‌ తలపడే తొలి రెండు టెస్టులకు వేదిక చెపాక్‌. దాదాపుగా ఇక్కడి పిచ్​లపై స్పిన్నర్లే ప్రభావం చూపుతారు. అయితే ఇక్కడా రూట్‌ ప్రధాన అస్త్రం స్వీప్‌షాటే కానుంది. ఈ నేపథ్యంలో తాన స్వీప్​ షాట్​ బాదటంలో తనను తాను ఎలా మెరుగుపరుచుకున్నాడో వివరించాడు​ రూట్.​

"సాధారణంగా నేను చాలా చిన్నవాడిని. శారీరకంగా ఎదగడానికి చాలా సమయం పట్టింది. స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఏదైనా దారిని కొనగాలనుకున్నాను. అప్పుడే స్వీప్​ షాట్​ను ఎంచుకున్నాను. దీనిపై పట్టుసాధించేందుకు గొప్ప ఆటగాళ్లు, కోచ్​లతో కలిసి బాగా పనిచేశాను. అలా ఈ షాట్​ ఆడటంలో అభివృద్ధి చెందాను. అయితే ఈ షాట్​ను బాదటం ఎంతో సవాలుతో కూడిన పని."

-జో రూట్​, ఇంగ్లాండ్​ సారథి.

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ, అస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్​ స్మిత్​, న్యూజిలాండ్​ క్రికెటర్​ విలియమ్స్​న్​ ఆట నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకున్నట్లు చెప్పాడు రూట్​. అయితే అవి నేర్చుకోవడం అంతా సులువు కాదని చెప్పాడు. వారు ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాళ్లని కొనియాడాడు. మొత్తంగా భారత్​తో జరిగే సిరీస్​ తమ జట్టు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: రూట్​ జోరును కోహ్లీసేన ఆపగలదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.