ETV Bharat / sports

'ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్ మనదే!' - సూర్యకుమార్ యాదవ్

ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్​ కప్​ను భారత్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ సూర్యకుమార్​ యాదవ్​. ఇతర జట్లతో పోలిస్తే టీమ్​ఇండియా గొప్పగా ఆడుతోందని ప్రశంసించాడు.

suryakumar yadav thinks india will win t20 world cup in india
'ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్ మనదే!'
author img

By

Published : Feb 22, 2021, 4:21 PM IST

ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్​ను భారత్​ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు యువ క్రికెటర్​ సూర్యకుమార్ యాదవ్​. ప్రస్తుత భారత జట్టు అసాధారణంగా ఆడుతుందని కొనియాడాడు.

"గత ఆస్ట్రేలియా పర్యటనలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శన చేసిన టీమ్​ఇండియా.. ఇతర జట్లతో పోల్చితే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత భారత జట్టు అసాధారణ ఆటతీరు కనబరుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్​ కప్​ మనదే అనిపిస్తుంది."

-సూర్యకుమార్ యాదవ్​, యువ క్రికెటర్​.

వచ్చేనెల ఇంగ్లాండ్​తో జరగనున్న 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్​కూ చోటు కల్పించింది బీసీసీఐ. దీంతో ఆ సిరీస్​తో పాటు వచ్చే ఐపీఎల్​లో రాణిస్తే.. టీ20 ప్రపంచ కప్​లోనూ చోటు దక్కే అవకాశం ఉంది.

ఎంఎస్​ ధోనీ నేతృత్వంలో భారత జట్టు.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వరల్డ్​ కప్​తో పాటు 2013 ఛాంపియన్స్​ ట్రోఫీలను గెలుపొందింది. అనంతరం మేజర్​ ట్రోఫీల్లో రెండు సార్లు ఫైనల్​ (2014 టీ20 వరల్డ్​ కప్​, 2017 ఛాంపియన్స్​ ట్రోఫీ)కి, మరో మూడు సార్లు సెమీస్ (2015, 2019 వరల్డ్​ కప్​, 2016 టీ20 వరల్డ్​ కప్​)​కు వెళ్లింది.

ఇదీ చదవండి: వచ్చే నెలలో బాక్సింగ్​ రింగ్​లోకి​ విజేందర్ ​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.