ETV Bharat / sports

'కోహ్లీ, స్మిత్​లను అధిగమించడం చాలా బాగుంది' - కోహ్లీ స్మిత్

కోహ్లీ, స్మిత్​లను దాటుకుని టెస్టు ర్యాంకింగ్​లో అగ్రస్థానానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని న్యూజిలాండ్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్​ అన్నాడు. జట్టు కోసం ఆడినప్పుడు తమకు ఇలాంటి గౌరవం లభిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తెలిపాడు.

'Surprising to move up ahead of Kohli and Smith', says Kane Williamson
'కోహ్లీ, స్మిత్​లను అధిగమించడం చాలా బాగుంది'
author img

By

Published : Dec 31, 2020, 6:21 PM IST

టెస్టు ర్యాంకింగ్స్​లో తాను అగ్రస్థానానికి చేరుకోవడం పట్ల న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్ విలియమ్సన్ హర్షం వ్యక్తం చేశాడు​. కోహ్లీ, స్మిత్​ను అధిగమించి ఆ స్థానానికి చేరడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపాడు.

"జట్టుకు ఏది చేయగలనో నేను అది చేశాను. మనం చేసిన సహకారం ర్యాంకింగ్​లో ప్రభావం చూపించడం చాలా బాగుంది. వారిద్దరూ (కోహ్లీ, స్టీవ్​ స్మిత్​) ఉత్తమ ఆటగాళ్లు. ఈ ఫార్మాట్​ ర్యాంకింగ్​లో ప్రతి ఏటా పోటీ పడతారు. వాళ్లకు వ్యతిరేకంగా ఆడి ఇలా టాప్ ర్యాంకుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది".

- కేన్​ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్​

2020 ఆఖర్లో పాకిస్థాన్‌పై శతకం బాదిన విలియమ్సన్​(129).. టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను వెనక్కినెట్టాడు. గురువారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విలియమ్సన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 2015లో తొలిసారి అతడు నంబర్‌ 1 టెస్టు బ్యాట్స్‌మన్‌గా ఎంపికవ్వగా.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని చేరుకున్నాడు.

ఇదీ చూడండి: మెల్​బోర్న్​లో హిట్​మ్యాన్ ప్రాక్టీస్ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.