అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. తన దృష్టిలో అసాధారణ ప్రతిభ కనబరిచే ఉత్తమ ఫీల్డర్ల పేర్లను తెలిపాడు. వీరంతా ఇన్నర్ సర్కిల్లో అద్భుతంగా క్యాచ్‌లు పడతారని చెప్పాడు. మిడాన్‌లో యువరాజ్(టీమ్ఇండియా మాజీ), మిడాఫ్‌లో రవీంద్ర జడేజా(టీమ్ఇండియా) బాగా ఫీల్డింగ్ చేస్తారని అభిప్రాయపడ్డాడు. దీంతోపాటు కవర్స్‌లో ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), బ్యాక్వర్డ్ పాయింట్ పొజిషన్లో జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా), మిడ్ వికెట్లో రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) మంచి ఫీల్డింగ్ చేస్తారని చెప్పాడు.
దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. ఈ మెగాలీగ్‌లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రైనా.