ఐపీఎల్ 2019 తొలిమ్యాచ్‌లో సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 5వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రైనా 19 పరుగులు చేశాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 5వేల మైలురాయిని అందుకున్నాడు సురేశ్ రైనా.
- 177 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రైనా 35 అర్ధశతకాలు సాధించాడు. 173 ఇన్నింగ్స్‌లో 34.27 సగటుతో 5వేల 4 పరుగులు చేసి ఈ ఘనత అందుకున్నాడు. రైనా తర్వాత విరాట్ కోహ్లీ 5వేల పరుగుల మైలురాయికి దగ్గరలో ఉన్నాడు. 164 మ్యాచ్‌ల్లో విరాట్ 4వేల 954 పరుగులు చేశాడు. ఇందులో 34 అర్ధశతకాలు ఉన్నాయి.
చెన్నై, ఆరీసీబీ మధ్య జరిగిన తొలిమ్యాచ్‌లో ధోనీ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 70 పరుగులకే ఆలౌటైన బెంగళూరు జట్టు చెన్నై స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. హర్భజన్, తాహిర్‌లు చెరో మూడు వికెట్లు తీసుకుని బెంగళూరు పతనాన్ని శాసించారు. జడేజా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హర్భజన్‌కు దక్కింది.