స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా లేకపోవడం చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)కు పెద్ద ఎదురుదెబ్బేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. రైనా స్థానంలో మరో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ను భర్తీ చేసుకోవడం ఆ జట్టుకు కష్టమేనని చెప్పాడు. అయితే సారథి ధోనీ ఆ జట్టుకు అతిపెద్ద బలమని జోన్స్ పేర్కొన్నాడు.
"సురేష్ రైనా లేకపోవడం చెన్నై జట్టుకి భారీ ఎదురుదెబ్బే. ఎందుకంటే.. ఐపీఎల్ పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో ఉంటాడు. రైనాది ఎడమచేతి వాటం. అందులోనూ స్పిన్‌ను బాగా ఆడతాడు. సీఎస్‌కేలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఆటగాళ్లే కావడం ఓ బలహీనత. ఆ జట్టుకు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవసరం. లేదా ఆ జట్టు ఆటగాళ్లు లెగ్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకే సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్‌ను ఎంచుకోవడం మంచిది."
-డీన్ జోన్స్, చైన్నై జట్టు.
దీంతోపాటు హర్భజన్ సింగ్ లేకపోడం కూడా సీఎస్కేకు తీరని లోటని అన్నాడు డీన్ జోన్స్. సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్‌తో చెన్నై జట్టు తలపడనుంది.
ఇదీ చూడండి 'టాప్-5లో ధోనీ ఎప్పటికీ ఉంటాడు'