ETV Bharat / sports

'పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్‌కు అవకాశాలు కష్టమే' - sunil gavaskar comments on ashwin

టెస్టుల్లో అద్భుత ఫామ్​లో ఉన్న స్పిన్నర్​ అశ్విన్​కు పరిమిత ఓవర్ల క్రికెట్​లో మాత్రం స్థానం దక్కడం కష్టమని దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ పేర్కొన్నాడు. హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా నుంచి అతనికి పోటీ ఉందని తెలిపాడు.

Sunil Gavaskar has said that it will be difficult for spinner Ashwin, to get a place in limited overs cricket.
'పరిమిత ఓవర్ల క్రికెట్​లో అశ్విన్‌కు అవకాశాలు కష్టమే'
author img

By

Published : Feb 21, 2021, 10:33 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. శతకంతో పాటు ఎనిమిది వికెట్లు సాధించాడు. దీంతో యాష్ తిరిగి భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు సంపాదిస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అశ్విన్ రీఎంట్రీకి అవకాశాలు లేవని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్ అన్నాడు.

"ప్రస్తుతం అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోకి వస్తాడనుకోవట్లేదు. ఎందుకంటే ఏడో స్థానంలో హార్దిక్‌ పాండ్య ఉన్నాడు. ఆ తర్వాత జడేజా ఉంటాడు. జట్టులో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలనుకుంటారు లేదా ఇద్దరు సీమర్లు కావాలనుకుంటారు. అందుకే ప్రస్తుతం అతడికి అవకాశాలు రావని భావిస్తున్నా. అయితే మరో ఆరు సంవత్సరాల పాటు అతడు టెస్టు ప్లేయర్‌గా కొనసాగుతాడు" అని గావస్కర్‌ తెలిపాడు. 2017, జూన్‌లో అశ్విన్‌ చివరిగా వెస్టిండీస్‌తో వన్డే, టీ20 ఆడాడు.

ఇదీ చదవండి: 'స్వదేశంలో అనుకూల పిచ్​లు మామూలు విషయమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.