ETV Bharat / sports

కివీస్​- పాక్​ మ్యాచ్​ను ఆపిన సూర్యుడు - sun stops New Zealand vs Pakistan 3rd T20I

న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్​ జరిగే సమయంలో బ్యాట్స్​మన్​ కళ్లలో సూర్య కిరణాలు పడటం వల్ల కాసేపు మ్యాచ్​ను నిలిపివేశారు. ఆ తర్వాత యథావిధిగా ఆటను కొనసాగించారు.

sun
సూర్యుడు
author img

By

Published : Dec 22, 2020, 8:06 PM IST

సూర్య కిర‌ణాలు నేరుగా బ్యాట్స్‌మన్ క‌ళ్ల‌లో ప‌డ‌డం వ‌ల్ల క్రికెట్ మ్యాచ్​ను తాత్కాలికంగా నిలిపివేశారు. నేపియర్ వేదికగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇది జరిగింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో హారీస్‌ రౌఫ్‌ వేసిన నాలుగో బంతిని గ్రీన్​ ఫిలిప్స్‌ సింగిల్‌ తీశాడు. కిరణాలు నేరుగా గ్రీన్​ కళ్లలో పడటం వల్ల బౌలర్‌ వేసిన బంతిని ఎదుర్కోలేకపోయాడు. ఆ వెంటనే ఫీల్డ్‌ అంపైర్లు చర్చించుకొని కొద్దిసేపు ఆటను ఆపేశారు. ఆ తర్వాత యథావిధిగా కొనసాగించారు.

సూర్యుడి వల్ల ఆటను తాత్కాలికంగా నిలిపివేయడం నేపియర్ (మెక్‌లీన్‌ పార్క్‌)‌ మైదానంలో రెండోసారి. 2019 జనవరిలో భారత్, కివీస్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్​లో బ్యాట్స్‌మెన్ కళ్లలోకి సూర్య కిరణాలు పడుతున్నాయని మ్యాచ్​ను కాసేపు ఆపారు. బ్యాటింగ్ చేస్తుండగా తన కళ్లలో వెలుగు పడుతుందని అప్పుడు శిఖర్ ధావన్ ఫిర్యాదు చేయడం వల్ల మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.

ఇదీ చూడండి : స్మిత్​కు కెప్టెన్సీ​.. ఆసీస్ బోర్డు ఏమంటోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.