ETV Bharat / sports

రెండో వన్డే ముంగిట ఆసీస్​కు ఎదురుదెబ్బ! - Stoinis injury latest news 2020

భారత్​తో రెండో వన్డేకు ఆస్ట్రేలియా క్రికెటర్​ మార్కస్​ స్టాయినిస్​ అందుబాటులో ఉండేది లేనిది అనుమానంగా మారింది. తొలి వన్డేలో బౌలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఆల్​రౌండర్​ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.

ind vs aus
రెండో వన్డే ముంగిట ఆసీస్​కు ఎదురుదెబ్బ!
author img

By

Published : Nov 28, 2020, 5:43 PM IST

ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది! ఆ జట్టు స్టార్​ ఆల్​రౌండర్​ మార్కస్​ స్టాయినిస్​ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో ఎడమ కాలి నొప్పి కారణంగా మైదానాన్ని వీడిన అతడు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్​ యాజమాన్యం తెలిపింది. అయితే స్టాయినిస్​ మ్యాచ్​ సమయానికి కోలుకునేది లేనిది ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది.

ఒకవేళ స్టాయినిస్​ మ్యాచ్​కు దూరమైతే.. అతడి స్థానంలో కేమరాన్​ గ్రీన్​, హెన్రిక్స్​ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గ్రీన్​ ఇటీవల షెఫీల్డ్​ షీల్డ్ కౌంటీ​ తరఫున మంచి ఫామ్​ కనబరిచాడు. బ్యాటింగ్​, బౌలింగ్​లో అదరగొట్టాడు. తాజాగా అతడు నెట్స్​లోనూ సాధన చేయడం చూస్తే.. రెండో మ్యాచ్​లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆదివారం సిడ్నీ వేదికగా జరగనుంది.

Stoinis news
స్టాయినిస్​

తొలి వన్డేలో ఆసీస్​ చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమ్​ఇండియా. కంగారూ జట్టు విజయంలో ఫించ్(114), స్మిత్(105) కీలక పాత్ర పోషించారు. దీంతో మూడు వన్డేల సిరీస్​లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.