ETV Bharat / sports

రిటైర్మెంట్​లోపు ఆ రెండు పనులు చేయాలి: స్మిత్

ఇంగ్లాండ్​, భారత్​తో సిరీస్​లను పెద్ద పర్వతాలతో పోల్చిన క్రికెటర్ స్మిత్.. తాను ఆటకు వీడ్కోలు పలికేలోపు వాటిని అధిరోహించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

రిటైర్మెంట్​లోపు ఆ రెండు పనులు చేయాలి: స్మిత్
క్రికెటర్ స్మిత్
author img

By

Published : Aug 6, 2020, 10:32 AM IST

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్​ స్టీవ్ స్మిత్.. తన రిటైర్మెంట్ తీసుకునేలోపు​ చేయాల్సిన రెండు అతిపెద్ద విషయాల గురించి చెప్పాడు. వీటిలో ఇంగ్లాండ్​ గడ్డపై యాషెస్ గెలవడం, భారత్​లో టీమ్​ఇండియాను ఓడించడం ఉన్నాయని అన్నాడు.

"నేను ఎక్కాల్సిన రెండు అతిపెద్ద పర్వతాలు ఉన్నాయి. వాటిని అధిరోహిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. నేను ఆ రెండింటిని అందుకుంటానని అనుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకెంత కాలం ఆడతానో తెలియదు. కానీ అంతలో వాటిని సాధించేందుకు కృషి చేస్తాను" -స్టీవ్ స్మిత్, ఆసీస్ ప్రముఖ క్రికెటర్

steve smith
ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్

గతేడాది ఇంగ్లాండ్​లో జరిగిన యాషెస్ 2-2తో డ్రా ముగిసింది. ఫలితంగా ఆస్ట్రేలియా ట్రోఫీని నిలబెట్టుకుంది. ఈ సిరీస్​లో 774 పరుగులతో స్మిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

2017 భారత పర్యటనలోనూ నాలుగు టెస్టుల్లో మూడు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు స్మిత్. కానీ ఆ సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయింది ఆసీస్. మళ్లీ 2022 అక్టోబరులో మనదేశానికి రానుంది కంగారూ జట్టు.

smith test stats
స్మిత్ టెస్టు గణాంకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.