ETV Bharat / sports

టీమ్ఇండియా​పై ఆ ఘనత సాధించిన స్మిత్​ - బోర్డర్​ గవాస్కర్​ ట్రోఫీ వార్తలు

టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో సెంచరీతో చెలరేగాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​. దీంతో భారత జట్టుపై అత్యధిక టెస్టు శతకాలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. కేవలం 25 ఇన్నింగ్స్​లోనే ఈ ఘనతను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు.

Steve Smith now with most Test tons against India
టీమ్ఇండియా​పై ఆ ఘనత సాధించిన స్మిత్​
author img

By

Published : Jan 8, 2021, 3:33 PM IST

సిడ్నీ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​ సెంచరీతో అలరించాడు. దీంతో టెస్టు క్రికెట్​లో భారత జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమ్​ఇండియాతో 25 ఇన్నింగ్స్​లలో ఆడిన స్మిత్​.. 8 సెంచరీలు చేశాడు.

టీమ్​ఇండియాపై 8 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియన్​ ఆటగాళ్ల జాబితాలో గ్యారీ సోబెర్స్​ (30 ఇన్నింగ్స్​) , వివియాన్ రిచర్డ్స్​ (41 ఇన్నింగ్స్​), రికీ పాంటింగ్​ (51 ఇన్నింగ్స్​) ఉన్నారు.

టెస్టు కెరీర్​లో ఇప్పటివరకు 27 సెంచరీలు చేసిన స్మిత్​.. విరాట్​ కోహ్లీ, గ్రేమ్​ స్మిత్​, అలెన్​ బోర్డర్​లతో సమం చేశాడు. 2017లో ధర్మశాల వేదికగా టీమ్​ఇండియాతో జరిగిన టెస్టులో శతకాన్ని నమోదు చేసిన స్మిత్ (111)​.. దాదాపుగా నాలుగేళ్ల తర్వాత మరోసారి సెంచరీ చేయడం విశేషం.

ఇదీ చూడండి: సిడ్నీ టెస్టు: శుభ్​మన్​ గిల్​ అర్ధశతకం.. భారత్​ 96/2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.