ETV Bharat / sports

'కెప్టెన్​గా స్మిత్​ ఓకే.. మరి వార్నర్​కు ఎందుకీ అన్యాయం?' - క్రికెట్​ ఆస్ట్రేలియా వార్తలు

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​గా మరొకరు దొరక్కపోతే స్టీవ్​స్మిత్​కే మళ్లీ జట్టు పగ్గాలు అప్పగించే అవకాశముందని ఆసీస్​ మాజీ సారథి ఇయాన్​ చాపెల్ అంటున్నారు. ఒకవేళ కెప్టెన్సీ చేపట్టేందుకు స్మిత్​కు అర్హత ఉంటే.. వార్నర్​పై ఎందుకు జీవితకాల నిషేధం విధించారని ఆసీస్​ బోర్డును ప్రశ్నించారు.

Steve Smith might get captaincy back in case of no other choice chappell
'కెప్టెన్​గా స్మిత్​ ఓకే.. మరి వార్నర్​కు ఎందుకీ అన్యాయం?'
author img

By

Published : Jan 22, 2021, 7:16 AM IST

టిమ్‌పైన్‌ స్థానంలో మరొకరు దొరక్కపోతే స్టీవ్‌స్మిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ చాపెల్‌ అంటున్నారు. 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో పాత్రధారి అయినప్పటికీ అతడివైపే మొగ్గు చూపొచ్చని అంచనా వేశారు. అతడితో పాటు ప్యాట్‌ కమిన్స్‌ రేసులో ముందున్నాడని పేర్కొన్నారు. టీమ్‌ఇండియాతో సిరీసులో కీపింగ్‌, సారథ్యం, వ్యూహాలపై విమర్శలు రావడం వల్ల టిమ్​ పైన్‌ తొలగింపుపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

"అవును, బహుశా స్మిత్‌కు మళ్లీ సారథ్యం దక్కొచ్చు. ఇంకొకరు దొరక్కపోతే అలా జరుగుతుందని అనుకుంటున్నా" అని చాపెల్‌ అన్నారు. నాయకత్వానికి స్మిత్‌కు అర్హత ఉన్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌కు జీవితకాల నిషేధం ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు. తన దృష్టిలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో వార్నర్‌ కన్నా స్మిత్‌ చేసిన నేరమే పెద్దదని చెప్పారు.

"స్మిత్‌, వార్నర్‌ ఒకే విభాగం కిందకు ఎందుకు రావడం లేదు? నాయకత్వంపై స్మిత్‌కు రెండేళ్ల నిషేధం ఉంటే వార్నర్‌కూ అంతే శిక్ష ఎందుకు లేదు? లేదా సారథ్యంపై వార్నర్‌కు జీవితకాల నిషేధం విధిస్తే స్మిత్‌ను ఎందుకు వదిలేశారు? నా దృష్టిలో వార్నర్‌ కన్నా స్మిత్‌ పెద్ద నేరస్థుడు" అని ఇయాన్‌ ఛాపెల్‌ కుండబద్దలు కొట్టారు.

దక్షిణాఫ్రికాపై 2018లో వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ పథకం వేయగా స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఇందుకు సహకరించారని ఆసీస్‌ విచారణలో తేలింది. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెట్​ నిషేధం విధించింది.

ఇదీ చూడండి: రిటైర్మెంట్​ తర్వాత పార్థివ్​కు ఆర్సీబీ గిఫ్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.