టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ త్వరలో అబుదాబి టీ10 లీగ్‌లో సందడి చేయనున్నాడు. ఇందులో మరాఠా అరేబియన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. నవంబర్ 14 నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీకి ఇప్పటికే ఐసీసీ ఆమోదం ఉంది. ఈ లీగ్‌లో యువరాజ్ అడుగుపెట్టడంపై ఇటీవల దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా హర్షం వ్యక్తం చేయగా... తాజాగా ఆసీస్ క్రికెటర్ బెన్ కట్టింగ్ కూడా ప్రశంసలు కురిపించాడు. టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బెన్ కట్టింగ్.
" ఈ లీగ్‌లో యువరాజ్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. టీ20, వన్డే క్రికెట్లో ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు విదేశీ లీగుల్లో ఆడుతున్నాడు. యువీ ఆట కోసం అభిమానులు మ్యాచ్‌లకు పోటెత్తుతారు".
-- బెన్ కట్టింగ్, ఆసీస్ క్రికెటర్
ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌నకు ఎంపికవ్వని యువరాజ్‌సింగ్... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విదేశీ లీగుల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇతడికి బీసీసీఐ నుంచి అనుమతి కూడా లభించింది. ఆ తర్వాత జులై-ఆగస్టులో గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో టొరంటో నేషనల్స్‌కు సారథ్యం వహించాడు.
-
Happy to announce that I will be playing for team @MarathaArabians in Abu Dhabi @T10League
— yuvraj singh (@YUVSTRONG12) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Be there to cheer for my team and catch me in action at Abu Dhabi from 14 - 24 Nov! Looking forward to it .. @parvezkhan35 @sohailkhan @alitumbi#AalaReAala #marathaarabians pic.twitter.com/6hdtbwQgtC
">Happy to announce that I will be playing for team @MarathaArabians in Abu Dhabi @T10League
— yuvraj singh (@YUVSTRONG12) October 26, 2019
Be there to cheer for my team and catch me in action at Abu Dhabi from 14 - 24 Nov! Looking forward to it .. @parvezkhan35 @sohailkhan @alitumbi#AalaReAala #marathaarabians pic.twitter.com/6hdtbwQgtCHappy to announce that I will be playing for team @MarathaArabians in Abu Dhabi @T10League
— yuvraj singh (@YUVSTRONG12) October 26, 2019
Be there to cheer for my team and catch me in action at Abu Dhabi from 14 - 24 Nov! Looking forward to it .. @parvezkhan35 @sohailkhan @alitumbi#AalaReAala #marathaarabians pic.twitter.com/6hdtbwQgtC
టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్‌కు డ్వేన్‌బ్రావో సారథ్యం వహిస్తున్నాడు. లసిత్ మలింగ, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జర్దాన్, క్రిస్ లిన్ ఇదే జట్టుకు ఆడుతున్నారు. జింబాబ్వే మాజీ సారథి ఆండీ ఫ్లవర్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.