ప్రపంచకప్లో లీగ్ దశలోనే శ్రీలంక జట్టు ఇంటి ముఖం పట్టడం వల్ల ఆ దేశ క్రీడా మంత్రి చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. మెగాటోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన లంకేయులు మూడు విజయాలు మాత్రమే సాధించారు. ఈ పరాభవానికి కారణంగా లంక జట్టు ప్రధాన కోచ్ చందిక హతురుసింగ సహా అతడి అసిస్టెంట్లపై వేటు పడనుంది. త్వరలో బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే సిరీస్ తర్వాత వీరు పదవుల్లో కొనసాగడంపై అనిశ్చితి నెలకొంది. ఆ దేశ క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో ఈ మేరకు ఆదేశాలిచ్చారట.
హతురుసింగకు మరో 16 నెలల కాలం వరకు కాంట్రాక్టు ఉంది. అయితే అది ముగియకుండానే చర్యలు తీసుకొనే అవకాశం ఉందట. 2017 డిసెంబర్లో హతురుసింగ శ్రీలంక జట్టు ప్రధాన కోచ్గా నియామకం అయ్యాడు. గతంలో బంగ్లాదేశ్ జట్టుకు మూడేళ్లు సేవలందించాడు. ఇతడి పర్యవేక్షణలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై లంకేయులు టెస్టు సిరీస్లో విజయాలు సాధించారు. ఫీల్డింగ్ కోచ్ స్టీవ్ రిక్షన్, బ్యాటింగ్ కోచ్ జాన్ లూయిస్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ రుమేశ్ రత్నాయక్ల కాంట్రాక్టులు ముగిసినా ఇప్పటివరకు పొడిగించకపోవడం గమనార్హం.
తొలి జట్టు బంగ్లా...
ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడనుంది. జులై 26 నుంచి ఆగస్ట్ 1 వరకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో భీకరమైన బాంబు దాడిలో 258 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్టిన విదేశీ జట్టు బంగ్లాదేశ్.