భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్లో పర్యటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీలంక తాజాగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఆ దేశ క్రికెట్ బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా పాక్భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి చెందారని, అక్కడ పర్యటించేందుకు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కోసం చూస్తున్నట్లు సమాచారం.
శ్రీలంక జట్టే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగే అవకాశముందని గత వారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పర్యటన స్పష్టతపై లంక రక్షణ మంత్రిత్వశాఖ విచారణ చేపట్టింది.
"గత నెలలో మా భద్రతాధికారి ఒకరితో కలిసి పాకిస్థాన్లో పర్యటించా. అక్కడ ఏర్పాట్లు చూసి సంతృప్తి చెందా. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వారు మాటిచ్చారు" - మోహన్ డిసిల్వా, లంక క్రికెట్ బోర్డు సెక్రటరీ
2009 మార్చిలో పాక్లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా ఆరుగురు లంక క్రికెటర్లకు గాయలయ్యాయి. అప్పటి నుంచి దక్షిణాసియా దేశాలు పాక్లో పర్యటించేందుకు ఆసక్తి కనబర్చలేదు.
ఇదీ చదవండి: కోహ్లీతో పోలిస్తే స్మిత్ శతకాలు చెత్తవి: జాంటీ రోడ్స్