లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న క్రికెటర్లు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలో లైవ్ చాట్ సెషన్లో పాల్గొన్న భారత బౌలర్ శ్రీశాంత్.. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.
"భవిష్యత్తులో టీమిండియా సారథిగా కేఎల్ రాహుల్ సరైన వ్యక్తి అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడు ఎంతో బాధ్యత, నిబద్ధత, ప్రణాళికతో ఆడుతున్నాడు. కోహ్లీలా నైతిక విలువలు పాటిస్తూ, వ్యూహాలు రచిస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. విరాట్‌లా జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం అతడికి ఉంది"
-శ్రీశాంత్, టీమిండియా క్రికెటర్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ప్రస్తుతం భారత జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కోహ్లీ సారథ్యం వహిస్తుండగా.. అప్పుడప్పుడు రోహిత్ ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్లో హిట్‌మ్యాన్ కెప్టెన్సీలోనే ముంబయి ఇండియన్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది.