ETV Bharat / sports

నిలకడైన ఆటతో.. రైజర్స్‌ రైట్‌ రైట్‌ - డేవిడ్ వార్నర్

ముంబయి ఇండియన్స్‌ మాదిరి జట్టు నిండా స్టార్లు లేరు! చెన్నై సూపర్‌కింగ్స్‌లా అభిమాన నీరాజనం వెన్నంటి లేదు! ఆడినా.. గెలిచినా.. ప్లేఆఫ్స్‌ చేరుకున్నా.. ఫైనల్‌కు వెళ్లినా.. చివరికి విజేతగా నిలిచినా ఎక్కువ హడావుడి ఏం ఉండదు! చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. గత అయిదు సీజన్లలో ప్రతిసారి ఆ జట్టు ప్లేఆఫ్స్‌ చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. 2016లో ఛాంపియన్‌గా అవతరించి.. 2018లో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

special story on sunrisers hyderabad
నిలకడైన ఆటతో.. రైజర్స్‌ రైట్‌ రైట్‌
author img

By

Published : Apr 5, 2021, 8:58 AM IST

Updated : Apr 5, 2021, 9:10 AM IST

ఐపీఎల్‌లో అత్యంత నిలకడ రాణిస్తున్న జట్టు సన్‌రైజర్స్‌. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆరంభంలో తడబడినా.. 2015లో డేవిడ్‌ వార్నర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదరగొడుతోంది. 2016 నుంచి 2020 వరకు వరుసగా అయిదేళ్లు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వార్నర్‌ నాయకత్వం.. టామ్‌ మూడీ వ్యూహ రచన.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గ నిర్దేశనం హైదరాబాద్‌కు కొండంత బలం. ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ అందించిన ట్రెవర్‌ బెయిలీస్‌ నిరుడు ప్రధాన కోచ్‌గా వచ్చాడు. దీంతో వ్యూహ బృందం మరింత పటిష్టమైంది. బెయిలీస్‌ కోచింగ్‌లో నిరుడు ఆరంభంలో తడబడినా ఆఖర్లో అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చి ప్లేఆఫ్స్‌ చేరుకుంది. తొలి ప్లేఆఫ్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తుచేసింది. రెండో క్వాలిఫయర్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది.

ఇదీ చదవండి: ఈసారి అదే మాకు ప్లస్ పాయింట్: కోచ్ కైఫ్

బలాలు..

కెప్టెన్‌ వార్నర్‌ బ్యాటింగ్‌.. భువనేశ్వర్‌, రషీద్‌ఖాన్‌, నటరాజన్‌, జేసన్‌ హోల్డర్‌లతో కూడిన బౌలింగ్‌ విభాగం తిరుగులేని బలాలు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు వార్నరే పెద్ద దిక్కు. క్రీజులో ఉన్నంతసేపు అతడు పరుగుల యంత్రమే. ఫీల్డింగ్‌లో మహా చురుకు. నాయకత్వంలోనూ వార్నర్‌ది ప్రత్యేకమైన శైలి. సీనియర్‌ బౌలర్లకు బౌలింగ్‌ వ్యూహాన్ని వదిలేసి లాంగాన్‌ లేదా లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేసే కెప్టెన్‌ బహుశా వార్నర్‌ ఒక్కడేనేమో. వార్నర్‌కు మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో జతకలిస్తే అగ్నికి వాయువు తోడైనట్లే. వీరిద్దరి బ్యాట్లు మాట్లాడుతున్నంత సేపు మైదానంలో కేరింతలకు కొదవుండదు. ఇద్దరు క్రీజులో ఉంటే మిడిలార్డర్‌కు పనే ఉండదు. పరుగుల ప్రవాహం అదుపులో ఉండదు. 2019 సీజన్‌లో జరిగింది అదే. ఆ సీజన్‌లో వార్నర్‌- బెయిర్‌స్టోల జోడీ పరుగుల సునామీ సృష్టించింది. వీరికి మిడిలార్డర్‌ నుంచి సహకారం లభిస్తే బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

special story on sunrisers hyderabad
ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్

మరోవైపు ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ సన్‌రైజర్స్‌ సొంతం. టీమ్‌ఇండియా బౌలర్లు భువనేశ్వర్‌, నటరాజన్‌, సందీప్‌శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లతో పటిష్టమైన దేశీయ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరుడు జట్టులో చేరిన జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో కీలకంగా మారాడు. ఇక లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఎప్పటికీ మ్యాచ్‌ విన్నరే. నిరుడు 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసి అత్యుత్తమంగా రాణించాడు. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ జట్టులో చేరడం సన్‌రైజర్స్‌కు మరో సానుకూలాంశం.

ఇదీ చదవండి: మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్​ఖాన్

బలహీనతలు..

సన్‌రైజర్స్‌ బలహీనత వార్నర్‌, బెయిర్‌స్టోలే. వాళ్లు రాణించిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. ఓపెనింగ్‌ జోడీ విఫలమైతే సన్‌రైజర్స్‌ దాదాపుగా మ్యాచ్‌ను కోల్పోయినట్లే. వార్నర్‌, బెయిర్‌స్టోలపై అధికంగా ఆధారపడటం సన్‌రైజర్స్‌ అతిపెద్ద లోపం. నిరుడు ప్రథమార్ధంలో ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రథమార్ధంలో వీరిద్దరు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు నష్టం చేసింది. వృద్ధిమాన్‌ సాహా, నటరాజన్‌, జేసన్‌ హోల్డర్‌లు సరైన సమయంలో జోరు చూపించారు. దీంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది.

special story on sunrisers hyderabad
కేన్ విలియమ్సన్-భువనేశ్వర్ కుమార్

మనీష్‌ పాండేలో నిలకడ లేకపోవడం.. ప్రియం గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మలకు అనుభవం లేకపోవడం మరో లోపం. గత ఏడాది సన్‌రైజర్స్‌ పెట్టుకున్న అంచనాల్ని ఈ ముగ్గురు నిలబెట్టుకోలేకపోయారు. అత్యున్నత స్థాయిలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమయ్యారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నదే సన్‌రైజర్స్‌ ముందున్న సవాల్‌. మిడిలార్డర్‌ బలహీనత వార్నర్‌- బెయిర్‌స్టోలపై అదనపు ఒత్తిడిగా మారకుండా చూసుకోవడం సన్‌రైజర్స్‌కు అత్యంత ముఖ్యం. వార్నర్‌, విలియమ్సన్‌, బెయిర్‌స్టో, రషీద్‌, హోల్డర్‌, జేసన్‌ రాయ్‌, మహ్మద్‌ నబి, ముజిబుర్‌ రహమాన్‌ వంటి నాణ్యమైన విదేశీ ఆటగాళ్ల నుంచి నలుగురిని తుది జట్టులోకి ఎంపిక చేసుకోవడం సన్‌రైజర్స్‌కు సవాలే.

ఇదీ చదవండి: సుందర్ కుక్కపిల్లకు క్రికెట్ స్టేడియం పేరు

దేశీయ ఆటగాళ్లు:

భువనేశ్వర్‌ కుమార్‌, షాబాజ్‌ నదీమ్‌, నటరాజన్‌, మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, సందీప్‌శర్మ, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్ ‌శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, బాసిల్‌ థంపి, ప్రియం గార్గ్‌, శ్రీవత్స గోస్వామి, సిద్ధార్థ్‌ కౌల్‌, జగదీశ్ సుచిత్‌, విరాట్‌ సింగ్.‌

విదేశీయులు: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), కేన్‌ విలియమ్సన్‌, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ నబి, జేసన్‌ హోల్డర్‌, జేసన్‌ రాయ్‌, ముజిబుర్‌ రహమాన్‌.

అత్యుత్తమ ప్రదర్శన: 2016-విజేత

ఇదీ చదవండి: 'షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్ నిర్వహణ‌'

Last Updated : Apr 5, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.