ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకొన్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్.. ఈ టోర్నీపై విమర్శలు గుప్పించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందన్న స్టెయిన్.. ఐపీఎల్‌లో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పాడు.
"పీఎస్‌ఎల్, ఎల్‌పీఎల్‌లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ఐపీఎల్ విషయానికొస్తే అక్కడ జంబో జట్లుంటాయి. పేరున్న ఆటగాళ్లు కనిపిస్తారు. ఎవరెంత సంపాదిస్తున్నారన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క్రికెట్ మరుగున పడిపోతుంది. పీఎస్‌ఎల్ కోసం రాగానే చాలామంది ఆటగాళ్లు నా గదికి వచ్చి ఎక్కడెక్కడ ఆడారు? మీ ప్రయాణం ఎలా సాగింది? అంటూ అడుగుతున్నారు. ఐపీఎల్‌లో ఇలాంటివి కనిపించవు. ఎంతకు అమ్ముడుపోయావన్నదే అక్కడ ప్రధాన చర్చ. అలాంటి వాటికి ఈ ఏడాది దూరంగా ఉండాలని అనుకున్నా" అని పీఎఎస్‌లో క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆడుతున్న స్టెయిన్ అన్నాడు.
ఇదీ చదవండి: గురువారం నుంచే చివరి టెస్టు.. దృష్టంతా పిచ్ పైనే!