ETV Bharat / sports

'స్మిత్​ మూల్యం చెల్లించుకున్నాడు.. కెప్టెన్సీ ఇవ్వండి'

author img

By

Published : Dec 15, 2020, 2:40 PM IST

టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో స్టీవ్ స్మిత్​కు కెప్టెన్సీ అప్పగించాలని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ మార్క్​ వా. అతడు చేసిన బాల్​ ట్యాంపరింగ్ తప్పుకు తగిన మూల్యాన్ని చెల్లించేసుకున్నాడని వెల్లడించాడు. అందుకు పశ్చాత్తాపం కూడా పడ్డాడని అన్నాడు.

Smith
స్మిత్​

2018లో బాల్​ ట్యాంపరింగ్​కు పాల్పడిన ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్​ స్మిత్​.. అందుకు తగిన మూల్యాన్ని చెల్లించేసుకున్నాడని తెలిపాడు ఆ దేశ మాజీ క్రికెటర్​​ మార్క్​ వా. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడని చెప్పాడు. కాబట్టి అతడికి కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అప్పజెప్పాల్సిన అవసరముందన్నాడు. డిసెంబరు 17నుంచి భారత్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో పగ్గాలను ఎవరికి అప్పజెప్పాలని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డులో చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మాజీ వికెట్​ కీపర్​ ఆడం గిల్​క్రిస్ట్​ కూడా స్మిత్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని మద్దతు పలికాడు.

"సారథిని ఎన్నుకునే విషయమై స్మిత్​కే నా మద్దతు. జట్టులోని ఉత్తమమైన ఆటగాళ్లలో అతడు ఒకడు. 34 టెస్టులు, 51 వన్డేలు, ఎనిమిది టీ20లకు సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. అతడు తాను చేసిన తప్పుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అందుకే చాలా మంది స్మిత్​కే మళ్లీ పగ్గాలు అప్పజెప్పాలని అంటున్నారు. కాబట్టి అతడు తన బాధ్యతను (కెప్టెన్) మళ్లీ స్వీకరించే అర్హతను సాధించాడు. అతను ఎంతో ప్రతిభావంతమైన సారథి అని నా అభిప్రాయం."

-మార్క్​ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​. ​

ప్రస్తుతం టెస్టు జట్టుకు టిమ్​ పైనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఇప్పటికే జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​లో వన్డేను ఆసీస్​, టీ20ను టీమ్​ఇండియాను కైవసం చేసుకున్నాయి.

ఇదీ చూడండి : 'స్మిత్​కు మళ్లీ కెప్టెన్సీ ఇస్తే రాణిస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.