యాషెస్ రెండో టెస్ట్ నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ వేసిన బంతికి తీవ్రంగా గాయపడ్డాడు ఆసీస్ ఆటగాడు స్టీవ్‌స్మిత్. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్ లాబస్‌చేంజ్ మైదానంలో అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్ పేరు రికార్డుకెక్కింది.
"గాయంతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. జట్టు వైద్య ప్రతినిధి రిచర్డ్స్ అంగీకారంతో స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ చట్టం ప్రకారం మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేశాం."
-- ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.
ఆసీస్ క్రికెట్ బోర్డు దరఖాస్తును పరిశీలించిన అంపైర్లు... కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు అవకాశమిచ్చారు. ఫలితంగా ఇన్నెళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 'లాబస్‌చేంజ్' తొలి కాంకషన్ ఆటగాడయ్యాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్వీట్ చేసింది.
-
Steve Smith has been ruled out of the remainder of the second Ashes Test.
— ICC (@ICC) August 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Marnus Labuschagne has been confirmed as his concussion replacement.#Ashes pic.twitter.com/ienFwUpInK
">Steve Smith has been ruled out of the remainder of the second Ashes Test.
— ICC (@ICC) August 18, 2019
Marnus Labuschagne has been confirmed as his concussion replacement.#Ashes pic.twitter.com/ienFwUpInKSteve Smith has been ruled out of the remainder of the second Ashes Test.
— ICC (@ICC) August 18, 2019
Marnus Labuschagne has been confirmed as his concussion replacement.#Ashes pic.twitter.com/ienFwUpInK
ఆడలేని స్థితిలో మరొకరికి....
ఒక క్రికెటర్ తల, మెడకు గాయమై.. ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్ అయితే అప్పుడు సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే అవకాశం కల్పిస్తారు. తాజాగా ఈ విధానానికి మార్గం సుగమం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఆటగాళ్ల భర్తీ నిర్ణయం జట్టు వైద్య ప్రతినిధి తీసుకుంటారు. మ్యాచ్ రిఫరీ దీనికి ఆమోదం తెలుపుతారు. ఈ కొత్త విధానాన్ని యాషెస్ సిరీస్ నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది ఐసీసీ.