గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు నిరాశే ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని వదులుకోగా.. రూ.కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు యూసఫ్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్, యూసఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. నువ్వే నిజమైన విన్నర్‌వని అన్నాడు.
-
Small hiccups doesn’t define your career,you have been outstanding thru out. A real match winner. Love you always Lala @iamyusufpathan pic.twitter.com/h3tw3AjoGS
— Irfan Pathan (@IrfanPathan) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Small hiccups doesn’t define your career,you have been outstanding thru out. A real match winner. Love you always Lala @iamyusufpathan pic.twitter.com/h3tw3AjoGS
— Irfan Pathan (@IrfanPathan) December 19, 2019Small hiccups doesn’t define your career,you have been outstanding thru out. A real match winner. Love you always Lala @iamyusufpathan pic.twitter.com/h3tw3AjoGS
— Irfan Pathan (@IrfanPathan) December 19, 2019
"తాత్కాలిక ఇబ్బందులేవీ.. నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేం. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్ విన్నర్‌వి" -ఇర్ఫాన్ పఠాన్, భారత క్రికెటర్
ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్.. ఈ ఏడాది రైజర్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు. 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే చేశాడు. ఈ సీజన్ మొత్తంలో కేవలం 6 బంతులే బౌలింగ్ చేశాడు.
యూసఫ్ పఠాన్లానే చాలామంది స్టార్ క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోలేదు. ఆసీస్ పేసర్ కమ్మిన్స్‌ను అత్యధికంగా రూ.15.5 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇది చదవండి: ఐపీఎల్ 2020: 8 ఫ్రాంఛైజీల కొత్త జాబితా ఇదే