ETV Bharat / sports

'సచిన్​ కంటే రోహిత్​శర్మ బెస్ట్​ ఓపెనర్'

వన్డేల్లో దిగ్గజ సచిన్​ కన్నా రోహిత్​శర్మ ఉత్తమ ఓపెనర్​ అని చెప్పాడు న్యూజిలాండ్​ మాజీ క్రికెటర్ సైమన్​ డాల్​. స్ట్రైక్​రేట్​ పరంగా మాస్టర్​ కంటే రోహిత్​ మెరుగ్గా ఉన్నాడని అన్నాడు.

sachin, rohith
సచిన్​, రోహిత్​
author img

By

Published : May 8, 2020, 1:50 PM IST

టీమిండియా బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మపై ప్రశంసలు కురిపించాడు న్యూజిలాండ్​ మాజీ​ బౌలర్​ సైమన్​ డాల్​. వన్డేల్లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందుల్కర్​ కన్నా ఉత్తమ ఓపెనర్​ అని అభిప్రాయపడ్డాడు.

"రోహిత్​కు మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు, గేర్లు మారుస్తూ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకునే సామర్థ్యం ఉంది. 60, 70, 80 పరుగుల దగ్గరే కాకుండా.. 90ల వద్ద ఒత్తిడికి గురికాకుండా ఆడతాడు. ప్రస్తుతం అతడి స్ట్రైక్​రేట్​ 88.93 ఉండగా, సగటు 49.27 ఉంది. అదే సచిన్ విషయానికొస్తే స్ట్రైక్​రేట్ 86.24, సగటు 44.83 ఉన్నాయి. కాబట్టి సచిన్​ కంటే రోహిత్​ మెరుగ్గా ఉన్నాడు. అందుకే ఉత్తమ ఓపెనర్​ అయ్యాడు"

-సైమన్​ డాల్, న్యూజిలాండ్​ మాజీ బౌలర్ ​

అయితే ఈ ఫార్మాట్​లో తొలి ద్విశతకం సచిన్ నమోదు చేయగా, ఆ తర్వాత వరుసగా మూడు డబుల్ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం భారత జట్టుకు ఉపసారథిగా ఉన్న ఇతడు.. గతేడాది వన్డే ప్రపంచకప్​లోనూ అద్బుత ప్రదర్శన చేశాడు. ఐదు శతకాలు చేయడం సహా టోర్నీ చరిత్రలో ఓ సీజన్​లో ఎక్కువ పరుగులు(648) చేసిన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.