దేవధర్ ట్రోఫీలో బారత్- ఏ తో జరిగిన మ్యాచ్‌లో భారత్- సీ.. 232 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సీ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ శతకాలతో చెలరేగి 50 ఓవర్లకు 366 పరుగుల భారీ స్కోరు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్- ఏ 134 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సోమవారం జరగనున్న ఫైనల్లో భారత్- బీతో తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్- సీ జట్టుకు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 226 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి ధాటికి భారత్- ఏ బౌలర్లు తేలిపోయారు.
-
Another centurion for India C as @RealShubmanGill brings up his 6th List A 💯
— BCCI Domestic (@BCCIdomestic) November 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/gvFvhTuDvs pic.twitter.com/oqlUXohhLM
">Another centurion for India C as @RealShubmanGill brings up his 6th List A 💯
— BCCI Domestic (@BCCIdomestic) November 1, 2019
Live - https://t.co/gvFvhTuDvs pic.twitter.com/oqlUXohhLMAnother centurion for India C as @RealShubmanGill brings up his 6th List A 💯
— BCCI Domestic (@BCCIdomestic) November 1, 2019
Live - https://t.co/gvFvhTuDvs pic.twitter.com/oqlUXohhLM
మయాంక్ అగర్వాల్ (120, 111 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (143, 142 బంతుల్లో) సెంచరీలతో కదం తొక్కారు. వీరితో పాటు మరో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 79 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్- ఏ జట్టు.. ప్రత్యర్థి బౌలర్ జలజ్ సక్సేనా ధాటికి 134 పరుగులకే కుప్పకూలింది. కేవలం 41 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు జలజ్. భారత్- ఏలో దేవ్‌దత్ (31) ఒక్కడిదే అత్యుత్తమ స్కోరు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్ అర్హతకు అడుకు దూరంలో భారత హాకీ జట్లు