టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. దీపావళి పండుగను జరుపుకొన్న అనంతరం ఇంటి టెర్రస్ మీద క్రికెట్ ఆడాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ రోజు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపాను. ఇలాంటి రోజులు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అందరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు" అని ధావన్ పోస్ట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పునరాగమనం నిరాశే...
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన ధావన్.. పునరాగమనంలో బాగా నిరాశపర్చాడు. వెస్టిండీస్ పర్యటనలో కేవలం 2, 36 పరుగులకే పరిమితమయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో... రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ధావన్ 76 పరుగులే చేశాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని... స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఈ 33 ఏళ్ల ఆటగాడికి చోటిచ్చారు సెలక్టర్లు. నవంబరు 3న తొలి టీ20(దిల్లీ),7వ తేదీన రెండో టీ20(రాజ్‌కోట్), 10న నాగ్‌పూర్ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది.
నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈడెన్ వేదికగా జరగనున్న రెండో టెస్టు.. డే/నైట్ రూపంలో గులాబి బంతితో ఆడనున్నాయి భారత్-బంగ్లా జట్లు.