ETV Bharat / sports

క్రికెటర్ ధావన్ జీవితంలో కష్టమైన పని అదే - Zoraver latest news

సునాయసంగా సిక్స్​లు, ఫోర్లు కొట్టే క్రికెటర్​ ధావన్​కు ఓ పని చేయడం చాలా కష్టమట. ఇంతకీ అదేంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Shikhar Dhawan Discloses What Is The "Toughest Task" Nowadays
నా జీవితంలో అదే కష్టమైన పని: ధావన్
author img

By

Published : Jul 30, 2020, 8:52 PM IST

లాక్​డౌన్​లో ఇంటికే పరిమితమైన టీమ్​ఇండియా క్రికెటర్​ శిఖర్​ ధావన్​ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తన కుమారుడు జోరావర్​తో కలిసి టిక్​టాక్ వీడియోలు చేస్తున్నాడు.​ అయితే తనను ఉదయాన్నే నిద్ర లేపడం చాలా కష్టమైన పని అని అంటున్నాడీ ఓపెనర్. అలా చేసేందుకు ఎంత కష్టపడ్డాడో చెబుతూ ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు.

"ప్రతిరోజు ఉదయం జోరావర్​ను బెడ్​ నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే అతడ్ని లేపడానికి మరెన్నో దారులు ఉన్నాయి" అని వ్యాఖ్య జోడించాడు​ ధావన్​. జోరావర్​తో కలిసి తీసుకున్న హాస్యభరిత ఫొటోను ఇటీవలే పోస్ట్ చేశాడు శిఖర్. అందులో వారిద్దరూ ముక్కుపుడకల లాంటి వస్తువుల్ని పెట్టుకుని కనిపించారు.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ధావన్. ఈ టోర్నీ యూఏఈ వేదిక సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే వారం పూర్తి షెడ్యూల్​ను విడుదల చేయనుంది బీసీసీఐ. గత సీజన్​లో 16 మ్యాచ్​లాడి 34.73 సగటుతో 521 పరుగులు​ చేశాడు ధావన్. మొత్తంగా 159 మ్యాచ్​ల్లో 4,579 పరుగులు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.