ETV Bharat / sports

పుజారాపై వార్న్​ వివక్షపూరిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్​ ఫైర్​

తొలి టెస్టులో టీమ్​ఇండియా క్రికెటర్​ ఛెతేశ్వర్​ పుజారాను 'స్టీవ్'(వర్ణవివక్ష చూపించడం)​గా వర్ణించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్​ వార్న్​. దీంతో అసహనానికి గురైన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై మండిపడుతున్నారు.

pujara
పూజారా
author img

By

Published : Dec 17, 2020, 3:59 PM IST

అడిలైడ్​ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా​ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఓ వివాదస్పద సంఘటన చోటుచేసుకుంది. ఈ పోరులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత షేన్​ వార్న్​.. టీమ్​ఇండియా క్రికెటర్​ పుజారా బ్యాటింగ్​ చేస్తోన్న సమయంలో అతడిపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు. అతడి పేరును 'స్టీవ్'​గా పలికాడు. దీంతో అసహనానికి గురైన భారత అభిమానులు వార్న్​ను విపరీతంగా విమర్శిస్తున్నారు.

'స్టీవ్'​ అంటే ఏమిటి?

ఇంగ్లాండ్​కు చెందిన యార్క్​షైర్​ క్రికెట్​ క్లబ్​లో​ వర్ణ, జాతి వివక్ష చూపిస్తారంటూ ఇటీవల ఆ దేశ క్రికెటర్​ అజీమ్​ రఫీక్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో అక్కడి ఆటగాళ్లు పుజారా పేరు పలకడం రాక స్టీవ్​గా పిలిచేవారన్న విషయం బయటకొచ్చింది. అయితే వర్ణ వివక్ష చూపించడాన్నే స్టీవ్​గా పిలుస్తారని తెలిసింది. ఇప్పుడు అదే పేరు పెట్టి వార్న్​ కూడా పుజారాను పిలవడం వివాదస్పదమైంది. ​

ఇదీ చూడండి : వర్ణవివక్షతో పుజారాను అలా పిలిచేవారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.