భారత్‌తో 2018-19 టెస్టు సిరీస్‌లో ఓటమి ఇప్పటికీ వేదన కలిగిస్తోందని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. జట్టులో వార్నర్ ఉన్నా లేకున్నా ఓడిపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
"భారత్‌తో గత టెస్టు సిరీస్‌లో ఓడిపోవడం ఇంకా బాధను కలిగిస్తోంది. జట్టులో స్మిత్, వార్నర్ ఉన్నా లేకపోయినా టెస్టు మ్యచ్నో లేదా సిరీస్నో ఓడిపోవడం సరికాదు. ప్రస్తుతం మా జట్టు సమతూకంతో ఉంది. అయితే స్మిత్, వార్నర్ పునరాగమనంతో వచ్చిన మార్పు మాత్రమే కాదిది. గత 18 నెలలుగా ఆసీస్ ఎంతో మెరుగైంది. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉన్నారు. భారత్‌పై సత్తా చాటేందుకు.. ప్రతీకారం తీర్చుకునేందుకు కుర్రాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. గత సిరీస్‌లో మా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. టీమ్ఇండియా పేసర్లను గత సిరీస్ కంటే ఎక్కువసేపు బౌలింగ్ చేయించగలిగితే మిగిలిన పని మా బౌలర్లు చూసుకుంటారు".
- టిమ్ పైన్, ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్
2018-19 సిరీస్‌లో కోహ్లీసేన నాలుగు టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో గెలిచి చరిత్ర సృష్టించింది.