ETV Bharat / sports

వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ సరికొత్త ​​ రికార్డు - వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళ కెప్టెన్ లూస్​​ రికార్డు

సౌతాఫ్రికా ఆల్​రౌండర్​, కెప్టెన్​ సునే లూస్​ వన్డేల్లో రికార్డు నెలకొల్పింది. వెయ్యి పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన పదో మహిళగా నిలిచింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో లిసా స్థలేకర్​(ఆస్ట్రేలియా), జులన్​ గోస్వామి(భారత్​) ఉన్నారు.

sas-sune-luus-becomes-10th-woman-to-achieve-double-of-1000-odi-runs-and-100-wickets
వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళ కెప్టెన్ లూస్​​ రికార్డు
author img

By

Published : Jan 27, 2021, 10:16 PM IST

దక్షిణాఫ్రికా మహిళ ఆల్​రౌండర్ సునే లూస్​ రికార్డు నెలకొల్పింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వెయ్యి పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన పదో మహిళ క్రికెటర్​గా నిలిచింది.

సొంతగడ్డపై పాకిస్థాన్​తో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. కెప్టెన్​ లూస్​ మూడు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది లూస్​ సేన.

మొదట బ్యాటింగ్​ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో తడబడ్డ పాక్​ జట్టు 169 పరుగులకే ఆలౌటైంది.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా స్థలేకర్​ 2728 పరుగులు, 146 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత ఆల్​రౌండర్​ జులన్ గోస్వామి 1076 పరుగులు, 225 వికెట్లతో తర్వాతి​ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: 'పృథ్వీషా.. ఆ పనులు వెంటనే చేసేయ్​' ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.