ETV Bharat / sports

అంపైర్లపై సర్ఫరాజ్ అసభ్యకర వ్యాఖ్యలు

పాక్ దేశవాళీ టోర్నీలో భాగంగా ఓ మ్యాచ్​లో అంపైర్​పై అసభ్యపదజాలం ఉపయోగించాడు సీనియర్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్. దీంతో​ బోర్డు అతడి మ్యాచ్​ ఫీజులో 35 శాతం కోత విధించింది.

Sarfaraz_Fined
ఎంపైర్​ నిర్ణయాన్ని పలుమార్లు దూషించిన సర్ఫరాజ్
author img

By

Published : Nov 8, 2020, 5:23 PM IST

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​కు ఆ దేశ క్రికెట్ బోర్డు 35 శాతం మ్యాచ్​ ఫీజులో కోత విధించింది. క్వైద్​-ఈ- ఆజామ్ ట్రోఫీలోని ఓ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టి అతడిని దూషించాడమే ఇందుకు కారణమని పేర్కొంది. సింధ్ ఫస్ట్ ఎలెవన్​ జట్టుకు కెప్టెన్​గా ఉన్న సర్ఫరాజ్​.. శనివారం జరిగిన మ్యాచ్​లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు.

"అంపైర్​ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సర్ఫరాజ్.. పలుమార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంపైర్లుగా ఉన్న ఫైజల్​ అఫ్రిది, సకిబ్ ఖాన్​ పాకిస్థాన్​ బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోర్డు నియమావళిలోని ఆర్టికల్​ 2.21 ప్రకారం సర్ఫరాజ్ నిబంధనలు​ ఉల్లంఘించాడు" అని పీసీబీ​ తెలిపింది.

ఇదీ చదవండి:స్మిత్​ ఆవలింతపై సర్ఫరాజ్​ భార్య ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.