విండీస్‌తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు పేసర్ నవదీప్ సైనీ. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా కరీబియన్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆట మొత్తం దాదాపు 140 కి.మీ వేగంతో పదునైన బంతులు వేశాడు సైనీ.
అంతర్జాతీయ టీ20లో అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేశాడు సైనీ. నాలుగు ఓవర్ల స్పెల్‌లో 19 డాట్ బాల్స్ వేశాడు. ఆఖరి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించడం విశేషం. భారత బౌలింగ్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది విండీస్ జట్టు. సైనీ ప్రదర్శనకు ముగ్ధుడైన కోహ్లీ.. అతడిలో మంచి ప్రతిభ ఉందని మెచ్చుకున్నాడు.
-
Virat Kohli has won the toss and India will bowl first in the opening T20I at Lauderhill.
— ICC (@ICC) August 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Navdeep Saini is in the side for his international debut. #WIvIND LIVE ⬇️ https://t.co/4H9X8shLSq pic.twitter.com/sFtoLDLSwv
">Virat Kohli has won the toss and India will bowl first in the opening T20I at Lauderhill.
— ICC (@ICC) August 3, 2019
Navdeep Saini is in the side for his international debut. #WIvIND LIVE ⬇️ https://t.co/4H9X8shLSq pic.twitter.com/sFtoLDLSwvVirat Kohli has won the toss and India will bowl first in the opening T20I at Lauderhill.
— ICC (@ICC) August 3, 2019
Navdeep Saini is in the side for his international debut. #WIvIND LIVE ⬇️ https://t.co/4H9X8shLSq pic.twitter.com/sFtoLDLSwv
"దేశవాళీలో దిల్లీ తరఫున ఆడిన నవదీప్ సైనీ.. ఈ ఏడాది ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతడిలో సూపర్ టాలెంట్ ఉంది. మంచి పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకోగలడు. 150 కి.మీ వేగంతో బంతులేసినా అలసిపోకుండా చివరి వరకు పదునైన పేస్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. తనలోని ప్రతిభ నిరూపించుకునే సమయం వచ్చింది. కచ్చితంగా ఇలాంటి ప్రదర్శనతో రాణిస్తే భవిష్యత్‌లో భారత్‌కు స్టార్ అవుతాడు. ఇప్పటి నుంచే అందుకోసం ప్రయత్నిస్తాడని అనుకుంటున్నా".
-విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి
తక్కువ లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్లూ తడబడ్డారు. వాతావరణ పరిస్థితుల వల్ల మైదానం కాస్త ఇబ్బంది పెట్టినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇవీ చూడండి...'సైనీ.. నీ ప్రదర్శనతో వారికి బుద్ధి చెప్పావ్'